'పుష్ప 2' విషయంలో దేవీకి దెబ్బేసిన సుకుమార్.. ఇక కెరీర్ కష్టమేనా..!

అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ 'పుష్ప2' మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. మూవీలో దేవీ నుంచి అనుకున్న స్థాయిలో BGM రాలేదట. దీంతో చివరి నిమిషంలో సుకుమార్ మరో మ్యూజిక్ డైరెక్టర్ కోసం చూస్తున్నారని టాక్.

New Update

Pushpa 2: అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప2. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పలు సార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఓ వైపు సినిమా రిలీజ్ దగ్గర పడుతుంటే.. ఈ మూవీ విడుదలకు మరో అడ్డంకి వచ్చినట్లు తెలుస్తోంది. 

మ్యూజిక్ విషయంలో అసంతృప్తి 

పుష్ప2 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారంట. చివరి వరకు కూడా  దేవి నుంచి అనుకున్న స్థాయిలో బీజీఎమ్ రాకపోవడంతో సుకుమార్ మరో మ్యూజిక్ డైరెక్టర్ కోసం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్. అయితే పుష్ప పార్ట్ 1లో సాంగ్స్ హైలైట్ గా ఉన్నప్పటికీ బీజీఎమ్ యావరేజ్ అంటూ విమర్శలు వచ్చాయి. దీంతో సుకుమార్ 'పుష్ప2'  బీజీఎమ్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చివరి నిమిషంలో చిత్ర యూనిట్ హడావిడి పడుతోందని టాక్.

Devi Sri Prasad: హ్యాపీ బర్త్ డే రాక్ స్టార్..!

Also Read: సైలెంట్ గా ధనుష్ కొత్త మూవీ.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది..!

నిజానికి దేవి.. సుకుమార్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటివరకు సుకుమార్ చేసిన 'ఆర్య', 'ఆర్య2', 100%లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం ఇలా  ప్రతీ సినిమాకు దేవీ సంగీతం అందించారు. ఆ సినిమాల్లోని పాటలు కూడా ఇప్పటికీ ఆల్ చాట్ బస్టర్స్ గా నిలిచాయి. అలాంటిది 'పుష్ప2'  విషయంలో  దేవీ మ్యూజిక్  పట్ల సుకుమార్ అసంతృప్తి చెందడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇలా జరిగితే ముందు ముందు దేవి కెరీర్ కు కష్టమే అని అనుకుంటున్నారు. అయితే  'పుష్ప 2' బీజీఎమ్ కోసం చివరి నిమిషంలో 'కాంతారా ' ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఎంచుకున్నట్లు టాక్..? మరో వైపు తమన్ పేరు కూడా వినిపిస్తోంది. వీరిద్దరిలో ఒకరు 'పుష్ప 2' బీజీఎమ్ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

Also Read: లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్, సక్సెస్, లవ్ స్టోరీ.. 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు