Rajamouli: 'SSMB29' పనులు మొదలెట్టిన రాజమౌళి.. ఫోటో షేర్ చేస్తూ

రాజమౌళి 'SSMB29' మూవీ కోసం లొకేషన్స్ వెతుకుతున్నారు. తాజాగా ఆయన పంచుకున్న ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎడారి ప్రాంతంలో తిరుగుతున్న ఫొటో షేర్‌ చేసిన రాజమౌళి.. ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అని దానికి క్యాప్షన్‌ పెట్టారు. ఈ పోస్ట్ వైరలవుతోంది.

rjmuli
New Update

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'SSMB29' ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని రాజ‌మౌళి ఈ సినిమా గురించి ఇప్ప‌టికే హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం చిత్రబృందం దృష్టి అంతా #SSMB29కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులపైనే ఉంది. 

Also Read :  మరోసారి ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా..?

లొకేషన్ వేటలో రాజమౌళి..

ఈనేపథ్యంలో రాజమౌళి ఈ సినిమా కోసం లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ఆయన తాజాగా పంచుకున్న ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎడారి ప్రాంతంలో తిరుగుతున్న ఫొటో షేర్‌ చేసిన రాజమౌళి ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అని దానికి క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఆయన మహేశ్‌ సినిమా కోసం లొకేషన్స్‌ సెర్చ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి పోస్ట్ తో మ‌హేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.  

Also Read : మరోసారి ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా..?

ఈ భారీ ప్రాజెక్ట్‌ కోసం రాజమౌళి ఏఐ టెక్నాలజీని వినియోగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలోని కొన్ని పాత్రలు, జంతువుల కోసం ఆయన ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారట. మాములుగానే రాజమౌళి సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌లు భారీస్థాయిలో ఉంటాయి. ఇక ఈ సినిమాలో అవి రెట్టింపుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. జనవరి రెండో వారంలో ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం. 

Also Read : మా సినిమా కూడా సంక్రాతికే..కానీ? 'తండేల్' రిలీజ్ పై డైరెక్టర్ అప్డేట్

Also Read :  ఇంట్లో కుమారుడి డెడ్‌బాడీ.. చూపు లేని ఈ తల్లిదండ్రుల బాధ చూస్తే కన్నీళ్లు ఆగవు!

#mahesh-babu #tollywood #ss-rajamouli #ssmb29-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe