/rtv/media/media_files/2024/10/29/3VWWchtWnQ6N0bis5b60.jpg)
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య - చందు మొండేటితో కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తండేల్'. శ్రీకాకుళంలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read : 10 నిమిషాల రన్నింగ్‌తో ఆ ప్రమాదకరమైన వ్యాధులు దూరం
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న‘తండేల్’ మూవీ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇదిలా ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల దాన్ని సంక్రాంతికి షిఫ్ట్ చేసినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. తాజాగా డైరెక్టర్ చందూ మొండేటి దీనిపై క్లారిటీ ఇచ్చారు.
జనవరికి #Thandel రెడీ..
— Ramesh Pammy (@rameshpammy) October 29, 2024
10 రోజులే షూట్ బ్యాలెన్స్
- Director @chandoomondeti#NagaChaitnya#ChandooMondetipic.twitter.com/Ci8Q46eSEs
Also Read:అరుణాచలంలో భర్తతో కలిసి శివజ్యోతి పూజలు.. ఫొటోలు వైరల్
పది రోజుల్లో పూర్తవుతుంది..
' సంక్రాంతి బరిలో మేము కూడా ఉన్నాం. 'తండేల్' షూటింగ్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా పదిరోజులలో మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ సంక్రాంతికి చరణ్ ఉన్నాడు కదా అని చిత్ర నిర్మాత అరవింద్ గారు ఆలోచిస్తే మాత్రం జనవరి బరిలో ఉండము. జనవరి 26న విడుదల చేద్దామంటే అది ఆదివారం కాబట్టి చేయలేకపోతున్నాం.
Also Read : దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?
చరణ్ గారి సినిమా వస్తుందని అరవింద్ గారు, వెంకటేష్ గారి సినిమా వస్తుందని చైతూ గారు ఆలోచిస్తే సంక్రాంతికి #Thandel రాకపోవచ్చు - @chandoomondetipic.twitter.com/7YT7mAYE6c
— TalkEnti (@thetalkenti) October 29, 2024
Also Read: అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్
ఈ సినిమాలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. కచ్చితంగా అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు..' అంటూ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి 'తండేల్' రిలీజ్ అల్లు అరవింద్ ఫైనల్ డెసిషన్ పై ఆధారపడి ఉంది. మరి ఆయన సంక్రాంతికి రిలీజ్ చేస్తారా? లేదా? అనేది చూడాలి.