2024 : ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో చాలానే విషాదాలు చోటుచేసుకున్నాయి. సౌత్ తో పోల్చుకుంటే బాలీవుడ్ లోనే ఎక్కువ మంది సినీ సెలెబ్రిటీలు మరణించారు. మన సౌత్ లో కూడా పలు దిగ్గజ దర్శకులు, నటీ,నటులు కాలం చేశారు. 2024 లో మరణించిన సినీ ప్రముఖుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
1. డేనియల్
ప్రముఖ తమిళ నటుడు డేనియల్ మార్చిలో గుండెపోటుతో మరణించారు. అతను 2002లో విడుదలైన తమిళ చిత్రం ఏప్రిల్ మాదత్తిల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 48 సంవత్సరాల వయస్సులోనే చనిపోయారు. తెలుగులో 'చిరుత' సినిమాలో విలన్ రోల్ చేసి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.
2.సూర్యకిరణ్
దర్శకుడు సూర్యకిరణ్ మార్చి 11న జాండిస్‌తో కన్నుమూశారు. అతని వయసు 49. సూర్య 1978లో బాలనటుడిగా తన కెరీర్‌ని ప్రారంభించి, 'మాస్టర్ సురేష్' పేరుతో 200 చిత్రాలలో కనిపించాడు. 'సత్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్ సినిమాలు డైరెక్ట్ చేశారు. ఇటీవల అతను బిగ్ బాస్ తెలుగు 4 లో కూడా పాల్గొన్నాడు. కానీ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు.
3. పవిత్రా జయరామ్
కన్నడ నటి పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె బెంగళూరులో జన్మించిన ఆమె.. కన్నడ టీవీ షోలతో నటనా జీవితాన్ని ప్రారంభించింది. 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. పలు టీవీ సీరియల్స్ తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 53 సంవత్సరాల వయస్సులోనే మరణించింది.
4.రామోజీ రావ్
ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపకుడు రామోజీ రావు జూన్ 8న 87 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన తన ప్రముఖ కెరీర్‌లో అనేక చిత్రాలను నిర్మించి, తెలుగు చిత్రసీమలో అంతర్భాగంగా వెలుగొందారు. అతని ప్రముఖ నిర్మాణ వెంచర్లలో మయూరి, డాడీ డాడీ మరియు ఇష్టం ఉన్నాయి.
5. గద్దర్
ప్రజాగాయకుడు, ప్రజా యుద్ధనౌక పేరొందిన గద్దర్ ఆగస్టులో కన్నుమూశారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ఆగస్టు 6 న తుదిశ్వాస విడిచారు. తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడిగా పేరు పొందారు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఉద్యమానికి ఊపు తీసుకొచ్చారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి నింపారు.
6. జాకిర్ హుస్సేన్..
ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ ఈ నెలలోనే మరణించారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందారు. ఈక్రమంలోనే తుదిశ్వాస విడిచారు.
7. 'బలగం' మొగిలయ్య
'బలగం' సినిమా ద్వారా అందరి ప్రశంసలు అందుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య ఇటీవల మరణించారు. కొన్ని రోజులుగా కిడ్నీల సమస్యతో మొగిలయ్య బాధపడుతున్న ఆయన వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
8. శ్యామ్ బెనెగల్
ప్రముఖ డైరెక్టర్, రచయిత శ్యామ్ బెనగల్ కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతూ డిసెంబర్ 23న ముంబైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. వివిధ రకాల భాషల్లో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. అంకుర్, నిషాంత్, మంథన్, భూమిక తదితర చిత్రాలతో భారతీయ సినీ యవనికపై బెనెగల్ తనదైన ముద్ర వేశారు. జునూన్, మండి, సూరజ్ కా సత్వాన్, ఘోడా, మమ్మో, సర్దారీ బేగమ్, జుబైదా లాంటి చిత్రాలు కూడా ఆయనకు అశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి.