Bigg Boss Promo: ఓ పక్క గొడవలు, మరో పక్క ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్స్ తో బిగ్ బాస్ సీజన్ 9 ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటికే జబర్దస్త్ రీతూ చౌదరీ- పవన్ కళ్యాణ్ మధ్య చిన్న లవ్ ట్రాక్ మొదలైనట్లు తెలుస్తోంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే.. హౌజ్ లో ఒక కొత్త ట్రయాంగిల్ లవ్ ట్రాక్ మొదలైనట్లు తెలుస్తోంది. గత సీజన్ లో అఖిల్, అభిజిత్ మోనాల్ మాదిరిగా.. ఈ సీజన్ లో మన రీతూ చౌదరీ, పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్ మధ్య చిన్నపాటి అలకలు, ప్రేమలు స్టార్ట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ యోగా చేస్తుంటే రీతూ అతడి దగ్గరికి వెళ్లి నువ్వేం చేసిన నిన్నే చూడాలని ఉంది అంటూ క్యూట్ గా ఫ్లర్ట్ చేస్తూ ఉంది. దానికి మన పవన్ కళ్యాణ్ ముసిముసి నవ్వులతో తెగ సిగ్గు పడుతూ కనిపించాడు ప్రోమోలో. మరోవైపు డెమోన్ పవన్ ''నీకోసం నేను బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటే కనీసం చూడలేదంటూ'' రీతూతో పులిహోర కలపడం మొదలెట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అలకలు మొదలయ్యాయి. రీతూ- అతడికి చిన్న గొడవ జరిగింది. అదే టైంలో రీతూ డెమోన్ పవన్ కి ప్రేమగా అన్నం తినిపించడంతో పవన్ కళ్యాణ్ మొహం మాడిపోయింది.
Bigg Boss Promo: బిగ్ బాస్ లో ట్రయాంగిల్ ట్రాక్ మొదలైందయ్యా.. లుక్స్ తోనే రొమాన్స్!
ఓ పక్క గొడవలు, మరో పక్క ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్స్ తో బిగ్ బాస్ సీజన్ 9 ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటికే జబర్దస్త్ రీతూ చౌదరీ- పవన్ కళ్యాణ్ మధ్య చిన్న లవ్ ట్రాక్ మొదలైనట్లు తెలుస్తోంది.
New Update
తాజా కథనాలు