Mirai Box Office Collections: యంగ్ హీరో తేజ సజ్జ మిరాయ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తూ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తక్కువ బడ్జెట్ తో రికార్డు వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్టర్ పంచుకుంది. అలాగే హీరో తేజ సజ్జ, మంచు మనోజ్ కూడా తమ సినిమా రూ. 100 కోట్లు కొల్లగొట్టిన సందర్భంగా ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. 'హను-మాన్' తర్వాత తేజ సజ్జకు ఇది వరుసగా రెండో భారీ విజయం. 'హను-మాన్' కూడా ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ రూ. 100 కోట్ల సినిమాలతో స్టార్ హీరోలు కూడా సాధించలేని అరుదైన ఫీట్ సాధించాడు తేజ. ఓవర్సీస్ లో కూడా 'మిరాయ్' మంచి వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు రాబట్టింది.
100 Crores⚔️🔥
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 17, 2025
Big love and gratitude to Audience especially families for celebrating #Mirai with all your heart🙏🏼❤️🤗
This is the Victory of Good Cinema🔥#BlackSword 🚀 pic.twitter.com/hKClY8PcrN
నిధి స్పెషల్ సాంగ్
మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంలోని విజువల్స్, నేపథ్య సంగీతం, కథా, కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాలో తేజ సజ్జ, అలాగే ప్రతినాయకుడిగా మంచు మనోజ్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాను 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' సంస్థ నిర్మించింది. సినిమాకు వచ్చిన భారీ విజయం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విజయవాడలో సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహించింది. సక్సెస్ మీట్ లో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ తో ఒక స్పెషల్ సాంగ్ షూట్ చేశామని, కానీ అది ఫస్ట్ ఆఫ్ లో వాడలేకపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం పార్ట్ 2 కోసం సిద్దమవుతున్నట్లు చెప్పారు.
Also Read:Shanmukh Jaswanth: 'ప్రేమకు నమస్కారం' అంటున్న షణ్ముఖ్.. కొత్త సినిమా గ్లింప్స్ అదిరింది బ్రో !