Singer Zubeen Garg: సింగర్ జుబీన్ గార్గ్ సడెన్ డెత్.. కన్నీళ్లు పెట్టిస్తున్న చివరి క్షణాలు!

ప్రముఖ అస్సామీ సింగ్ జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తు సింగపూర్ స్కూబా డ్రైవింగ్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే జుబీన్ మృతి చెందడానికి ముందు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గార్గ్ చివరి క్షణాలను చూసి ఫ్యాన్స్ కన్నీరు పెట్టుకుంటున్నారు.

New Update
Singer Zubeen Garg

Singer Zubeen Garg

ప్రముఖ అస్సామీ సింగ్ జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తు సింగపూర్ స్కూబా డ్రైవింగ్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. 52 ఏళ్ల గార్గ్ సింగపూర్‌లో జరిగే 20వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి గార్గ్ మృతి చెందారు. ప్రమాదానికి గురైన వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. అయితే లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్ల కొన్ని నిమిషాల వ్యవధిలోనే నీళ్లలో శవమై కనిపించారు.

ఇది కూడా చూడండి: Rashmika in Krrish 4: రేష్మిక అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. బడా ప్రాజెక్టులోకి బంపరాఫర్..!

శోక సంద్రంలో కుటుంబ సభ్యులు..

జుబీన్ గార్గ్ మరణవార్త విన్న అభిమానులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తక్కువ వయస్సులోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. అయితే జుబీన్ మృతి చెందడానికి ముందు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తన లైఫ్ జాకెట్‌తో ఈత కొట్టడానికి పడవ నుండి దూకుతున్నారు. అయితే జుబీన్ గార్గ్ చివరి క్షణాలను చూసి ఫ్యాన్స్ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇతని మృతిపై ప్రధాని మోదీ, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంతాపం తెలియజేశారు. హిమంత బిశ్వ శర్మ జుబీన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

ఇది కూడా చూడండి: Little Hearts US Collections: ఈ క్రేజ్ ఏంటి సామీ! 'లిటిల్ హార్ట్స్' నార్త్ అమెరికా బాక్సఫిస్ లెక్కలివే..

Advertisment
తాజా కథనాలు