Rashmika in Krrish 4: రేష్మిక అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. బడా ప్రాజెక్టులోకి బంపరాఫర్..!

రష్మిక మందన్నా ‘క్రిష్ 4’లో హీరోయిన్‌గా ఎంపికైనట్టు బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. హృతిక్ రోషన్ నటిస్తూ దర్శకుడిగా డెబ్యూట్ చేయనున్న ఈ సూపర్ హీరో చిత్రం 2027లో విడుదలకు సిద్ధమవుతోంది. రష్మిక అధికారికంగా ఫైనల్ అయితే, ఆమెకు పాన్ ఇండియా క్రేజ్ దక్కనుంది.

New Update
Rashmika in Krrish 4

Rashmika in Krrish 4

Rashmika in Krrish 4: పాన్ ఇండియా స్టార్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌కి చాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్‌ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్ 4’ లో హీరోయిన్‌గా రష్మిక ని సెలెక్ట్ చేశారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రం, క్రిష్ సిరీస్‌లో నాల్గవ భాగం. అంతేకాదు ఈసారి హృతిక్ నటించడమే కాకుండా, దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపట్టనున్నారు. అంటే ఇది హృతిక్‌కి డైరెక్షన్‌లో ఫస్ట్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని, త్వరలో షూటింగ్‌ ప్రారంభమవుతుందని సమాచారం. మేకర్స్ ప్రకారం, చిత్రం 2027లో విడుదల కావాలని ప్లాన్ చేస్తున్నారట.

Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

‘క్రిష్ 4’ లో హీరోయిన్‌గా రష్మిక..

ఇక హీరోయిన్ విషయానికొస్తే, రష్మికతో చిత్రబృందం చర్చలు జరుపుతోందని, ఆమె ఈ అవకాశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

బాలీవుడ్‌లో ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాలతో సరైన గుర్తింపు రాకపోయినా, ‘పుష్ప’, ‘అనిమల్’, ‘ఛావా’ లాంటి భారీ హిట్లతో రష్మిక తన సత్తా నిరూపించింది. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్‌ చిత్రం ‘సికందర్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా, రష్మికపై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె ‘థామా’, ‘కాక్‌టెయిల్ 2’, ‘అనిమల్ పార్క్’, ‘పుష్ప 3’, AA22XA6 వంటి పలు చిత్రాల్లో నటిస్తోంది.

Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్‌ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్

ఈ నేపథ్యంలో, ‘క్రిష్ 4’ ప్రాజెక్ట్‌లో రష్మిక చేరితే, ఆమె పూర్తి స్థాయి పాన్ ఇండియా హీరోయిన్‌గా మారడం ఖాయం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సూపర్ హీరో చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తంగా, రష్మిక 'క్రిష్ 4'లో భాగమవుతుందా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కానీ ఒకవేళ ఆమె అధికారికంగా ఫైనల్ అయితే, రష్మిక కెరీర్‌లో ఇది మరో మెగా మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు