/rtv/media/media_files/2025/09/20/little-hearts-us-collections-2025-09-20-12-00-49.jpg)
Little Hearts US Collections
Little Hearts US Collections:
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లిటిల్ హార్ట్స్’ తెలుగు చిత్ర పరిశ్రమలో ఆశ్చర్యకర విజయాన్ని అందుకుంది. మౌళి తనుజ్ ప్రసాంత్, శివాని నాగరం జంటగా నటించిన ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, #90’s ఫేమ్ ఆదిత్య హసన్ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. మొదట ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే ఆలోచన ఉన్నా, థియేటర్లలో విడుదల చేయడం చిత్రబృందానికి కలిసొచ్చింది.
#LittleHearts North America Gross - $1M+ 🙏🙏🙏💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥🔥💥🔥💥🔥💥 pic.twitter.com/7k0eOpbODN
— ATPBO (@AnantapurBO) September 20, 2025
సాధారణంగా డెబ్యూ హీరో, డెబ్యూ డైరెక్టర్ సినిమాలు ఇంత పెద్ద రేంజ్‌లో సక్సెస్ కావడం అరుదు. కానీ ‘లిటిల్ హార్ట్స్’ మాత్రం అందుకు భిన్నంగా నిలిచి, నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి భారీ మైలురాయిని నమోదు చేసింది. ఇది చిన్న బడ్జెట్ సినిమాకు గర్వించదగిన విషయం.
Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలో రొమాంటిక్ కామెడీ జానర్‌కి ఉన్న క్రేజ్ ఈ సినిమా విజయం ద్వారా మరోసారి రుజువైంది. ‘‘మిరాయ్’’, ‘‘కిష్కింధపురి’’ వంటి సినిమాల పోటీ మధ్య వచ్చినా, ‘లిటిల్ హార్ట్స్’ తనదైన గుర్తింపు తెచ్చుకుంది.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, జయకృష్ణ, అనిత చౌదరి, ఎస్.ఎస్. కంచి, సత్య కృష్ణన్ వంటి పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రల్లో కనిపించగా, సంగీతాన్ని సింజిత్ యెర్రమిల్లి అందించారు. వంశీ నందిపాటి, బన్నీ వాసు డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టారు.
Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?
ప్రస్తుతం ఈ సినిమా రూ.40 కోట్ల గ్రాస్ మార్క్‌కు చేరువవుతోంది. ప్రేక్షకుల రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని, చిత్ర బృందం ఈ సినిమాను త్వరగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో రిలీజ్ చేయబోమని స్పష్టంగా తెలిపింది.
‘లిటిల్ హార్ట్స్’ చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సాధించి, ఇండస్ట్రీకి ఓ మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. మంచి కథ, సింపుల్ కథనంతో కూడిన ఎంటర్టైనర్‌లు ఎప్పుడూ విజయాన్ని అందుకుంటాయని ‘లిటిల్ హార్ట్స్’ ప్రూవ్ చేసింది.