/rtv/media/media_files/2025/07/16/phone-call-2025-07-16-07-23-08.jpg)
ప్రియురాలు ఫోన్ మాట్లాడలేదని ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజంపేట మండలం మన్నూరులో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటపల్లి తాండాకు చెందిన జయపాల్ నాయక్ (19) ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనికి వజ్రకరూరుకు మండలానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇందరూ బాగానే మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా యువతి జయపాల్ తో మాట్లాడటం మానేసింది. పలు మార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో జయపాల్ మనస్తాపానికి గురయ్యాడు. మన్నూరులో నివాసం ఉంటున్న ఓ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు అంటున్నారు. కేసు నమోదు చేసిన మన్నూరు పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పురుగుల మందుతాగి ఆత్మహత్య
ఇక మరో ఘటనలో మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన బి.కొత్తకోట మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం రామాపురానికి చెందిన చిన్నవెంకటరమణ కుమారుడు చౌడప్పకు (30) చౌటకుంటపల్లెకు చెందిన కనకలక్ష్మితో పెళ్లైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు దేవాన్ష్ ఉన్నాడు. చౌడప్పకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన అతను ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.