Telusu Kada Trailer: స్టార్ బాయ్ సిద్దూ జొన్నల గడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'తెలుసు కదా' ట్రైలర్ విడుదలైంది. ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ లవ్ స్టోరీ, ఇంటెన్స్ ఎమోషన్స్ ఆకట్టుకుంటున్నాయి. సిద్దూ డైలాగ్స్, వైవా హర్ష కామెడీ టైమింగ్ అలరించాయి. ఇందులో సిద్దూ రాశీ, శ్రీనిధి ఇద్దరితో ఒకేసారి ప్రేమలో ఉంటాడు. అసలు ప్రేమంటే ఏంటీ? సిద్దూ ఇద్దరిని ప్రేమించడానికి కారణమేంటి? చివరికి ఆ ఇద్దరిలో సిద్దు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనే అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రముఖ సెలబ్రెటీ స్టైలిష్ నీరజకోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది.
Telusu Kada Trailer: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!
స్టార్ బాయ్ సిద్దూ జొన్నల గడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'తెలుసు కదా' ట్రైలర్ విడుదలైంది. ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ లవ్ స్టోరీ, ఇంటెన్స్ ఎమోషన్స్ ఆకట్టుకుంటున్నాయి.
New Update
తాజా కథనాలు