Telusu Kada: 'తెలుసు కదా' ఫ్యామిలీతో చూడచ్చా? నెటిజన్ ప్రశ్నకు సిద్ధూ దిమ్మతిరిగే రిప్లై!!

'తెలుసు కదా' సినిమాను ఫ్యామిలీతో చూడచ్చా? అని ఫ్యాన్ అడగగా, సిద్ధూ జొన్నలగడ్డ "ఇది ఫ్యామిలీ, యూత్ ఎమోషన్స్ కలిపిన సినిమా, కుటుంబంతో చూడొచ్చు" అని రిప్లై ఇచ్చారు. ప్రేమ, రిలేషన్‌షిప్‌ల నేపథ్యంలో సాగే ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదలకానుంది.

author-image
By Lok Prakash
New Update
Telusu Kada Trailer

Telusu Kada

Telusu Kada: యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా నటించిన కొత్త సినిమా "తెలుసు కదా" అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే యూత్ ను ఆకట్టుకుంటున్నాయి.

Also Read: ‘బాహుబలి: ది ఎపిక్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్‌ ఎంతంటే..?

ఈ సినిమా ప్రేమ, రిలేషన్‌షిప్‌ల నేపథ్యంలో సాగే ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందింది. అయితే, ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడచ్చా? అనే ప్రశ్నకు సిద్ధూ స్వయంగా సమాధానం ఇచ్చారు.

Also Read: రీ-రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంట్రా..? "బాహుబలి: ది ఎపిక్" పెద్ద ప్లానే ..!

సోషల్ మీడియాలో ఫ్యాన్ ప్రశ్న.. సిద్ధూ రిప్లై

సిద్ధూ జొన్నలగడ్డ తన ట్విట్టర్ (X) అకౌంట్‌లో అభిమానులతో చిట్‌చాట్ చేశాడు. ఆ సందర్భంలో ఓ ఫ్యాన్ ప్రశ్నించాడు "తెలుసు కదా సినిమాను అమ్మతో కలిసి వెళ్లి చూడొచ్చా?" అని.


"అవును! ఇది ఫ్యామిలీ, యూత్ ఎమోషన్ల అన్ని కలిపి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు యూత్ కోసం డిజైన్ చేసినప్పటికీ, ప్రధానంగా ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్."

Also Read: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్స్ ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే..!

ఈ సమాధానంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో కూడా సినిమాపై ఆసక్తి పెరిగింది. ట్రైలర్ చూసినవారికి ఇది కేవలం యూత్ సినిమా అనిపించినా, సిద్ధూ మాటలతో ఇది ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా చూసే సినిమా అని క్లారిటీ వచ్చింది.

తమన్ మ్యూజిక్ హైలైట్.. 

ఈ సినిమాకు మ్యూజిక్ అందించినది స్టార్ కంపోజర్ ఎస్.ఎస్. తమన్. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అవుతాయన్న అంటున్నారు.

Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!

ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ స్థాయిలో నిర్మించింది. దీపావళి సందర్భంగా విడుదల కావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశం ఉంది.

మొత్తానికి, "తెలుసు కదా" సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటుందని హీరో సిద్ధూ క్లారిటీ ఇచ్చాడు. ఈ దీపావళికి కుటుంబంతో కలిసి సిద్ధూ 'తెలుసు కదా' సినిమా చూడడానికి రెడీ అయిపోండి!

Advertisment
తాజా కథనాలు