Siddharth 3BHK
Siddharth 3BHK: ఎప్పుడో అనౌన్స్ చేసిన సిద్ధార్థ్ 3BHK మూవీ ఎట్టకేలకు రిలీజ్ కాబోతుంది. ప్రముఖ నటులు శరత్ కుమార్(Sarath Kumar), హీరో సిద్ధార్థ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం, హృదయాన్ని హత్తుకునేలా కుటుంబ కథాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శ్రీ గణేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!
జులై 4, 2025 న థియేటర్లలో
తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్, ఈ చిత్రం జులై 4, 2025 న థియేటర్లలో విడుదల కానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ప్రమోషన్ల కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.
#Siddharth’s #3BHK hits theatres July 4th!
— Moviebuff (@moviebuffindia) May 13, 2025
Siddharth | Sarath Kumar | Devayani | Yogi Babu | Meetha Raghunath | Chaithra pic.twitter.com/o9Yg0aarcu
చిత్రంలో దేవయానీ కీలక పాత్ర పోషించగా, "గుడ్ నైట్" సినిమా ద్వారా గుర్తింపు పొందిన మీతా రఘునాథ్, చైత్ర జే ఆచార్, కామెడీ స్టార్ యోగి బాబు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?
ఈ చిత్రాన్ని అరుణ్ విశ్వా నిర్మిస్తున్నారు. సంగీతం అమృత్ రామ్నాథ్ తన మెలోడీ టచ్‌తో ప్రేక్షకులను మెప్పించనున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుండగా, మరిన్ని తాజా అప్‌డేట్లు త్వరలో వెల్లడించనున్నారు.
Also Read: బాలయ్య కొత్త ఆయుధం రెడీ.. ఇక దబిడి దిబిడే..!