Kannappa: కన్నప్ప సినిమాకు షాక్.. రిలీజ్‌కు బ్రేక్‌ !

కన్నప్ప సినిమా విడుదలకు ముందే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సినిమాలో బ్రహ్మణులను అవమానపరిచేలా సీన్లు ఉన్నాయని ఆ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సినిమాలోని 13 సీన్లు తొలగించనున్నారు. దీంతో జూన్‌ 27న రిలీజ్‌ చేయాలనుకున్న సినిమాకు బ్రేక్ పడే అవకాశం ఉంది.

New Update
kannappa movie pilaka -gilaka roles  controversy

kannappa movie pilaka -gilaka roles controversy

 Kannappa: మంచు విష్ణు కన్నప్ప సినిమా విడుదలకు ముందే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సినిమాలో బ్రహ్మణులను అవమానపరిచేలా సీన్లు ఉన్నాయని ఆ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సినిమాలోని 13 సీన్లు తొలగించే అవకాశం కనపడుతోంది. జూన్‌ 27న రిలీజ్‌ చేయాలనుకున్న సినిమా ఆ రోజు చేస్తారా? లేదా మళ్లీ వాయిదా పడుతుందా? అనే సందేహం నెలకొంది. సినిమాలో ఉన్న 13 సీన్లు సమాజంలో అనవసరమైన దృక్పథాలను ప్రదర్శిస్తున్నాయని బ్రహ్మణచైతన్య వేదిక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సెన్సార్‌ బోర్డు జోక్యం చేసుకుంది.

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

ఈ సినిమా విడుదలకు ముందు, 13 సీన్లపై 11 మంది సభ్యుల కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.  సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని అభిప్రాయపడింది. వాటిని తొలగించి మళ్లీ ప్రివ్యూ ఇవ్వాలని సూచించింది. దీంతో 13 సీన్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాతే కన్నప్ప సినిమాకు అనుమతి ఇవ్వనున్నట్లు  సెన్సార్ బోర్డు తెలిపింది.  కాగా ఈ సీన్లు తొలగిస్తే సినిమా అర్థవంతంగా ఉంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఆ సీన్లు కీలక సన్నివేశాల సమయంలో వచ్చే అవకాశం ఉంటే ఆ సన్నివేశాలను తిరిగి షూట్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో జూన్‌ 27న రిలీజ్‌ చేస్తారా? వాయిదా వేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

Also Read: Allu Arjun: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

ఈ మధ్యే కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్‌ డ్రైవ్‌ ను ఆఫీస్‌ భాయ్‌ తీసుకెళ్లడం వివాదానికి దారి తీసింది. మరోవైపు మంచు ఫ్యామిలీలో నెలకొన్న  వివాదాలు కూడా సినిమా మీద ప్రభావం చూపాయి. కన్నప్ప సినిమా మీద మంచు విష్ణు చాలా అంచనాలు పెట్టుకున్నాడు.  ఈ సినిమాలో  అగ్రకథనాయకులు ప్రభాస్‌, అక్షయ్‌కుమార్‌, కాజల్‌, మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, ప్రీతి ముకుందన్‌, శరత్‌కుమార్‌, దేవరాజ్‌లతో పలువురు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళం కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 

Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు