/rtv/media/media_files/2025/06/02/Ka0r88UYF9pHwxydgrFE.jpg)
shiva raj Photograph: (shiva raj)
Shiva Rajkumar: కన్నడ భాషపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన కమల్ ప్రసంగానికి చప్పట్లు కొట్టినట్లు వస్తున్న వార్తలను కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఖండించారు. కమల్ వ్యాఖ్యలకు తాను చప్పట్లు కొట్టలేదని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యల సమయంలో క్లాప్స్ కొట్టలేదని, వేరే స్పీచ్ సమయంలో కొట్టా ఎడిటింగ్‌లో అలా వచ్చిందన్నారు.
నా ప్రాణం ఇస్తా..
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివరాజ్ కుమార్.. ‘నాకు అన్ని భాషలు ముఖ్యమైనవే. కానీ మాతృభాష కన్నడకే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను గతంలోనూ చెప్పాను ఇప్పుడు ఇదే చెబుతున్నా. కన్నడ కోసం నా ప్రాణమైనా ఇస్తా. ఇక కమల్ చాలా సీనియర్ నటుడు. ఆయనకు వీరాభిమానిని. ఆ ఈవెంట్‌లో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. కానీ కమల్ కన్నడ వ్యాఖ్యల సమయంలో నేను చప్పట్లు కొడుతున్నట్లు చూపించారు. నిజానికి నేను అప్పుడు చప్పట్లు కొట్టలేదు. వేరే విషయంలో కొడితే దానిని ఎడిటింగ్ చేసి అలా చూపిస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!
ఇక కమల్ నటించిన‘థగ్ లైఫ్’ జూన్ 5న విడుదల కానుంది. ఈనేపథ్యంలో కర్ణాటకలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా కన్నడపై ప్రేమతోనే అలా మాట్లాడానని కమల్ చెప్పారు. ప్రేమ ఉన్నప్పుడు క్షమాపణ చెప్పరాదన్నారు. భాష చరిత్ర గురించి ఎంతోమంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదని కమల్ కవర్ చేసుకుంటున్నారు.
kannada | Kamal Haasan | kannada-star-siva-rajkumar | telugu-news