Shiva Rajkumar: ఆ సమయంలోనే క్యాన్సర్ బయటపడింది.. శివరాజ్ కుమార్ ఎమోషనల్

శివరాజ్ కుమార్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తనకు క్యాన్సర్ ఎప్పుడు బయటపడింది? అనే విషయాలను పంచుకున్నారు. గతేడాది ఏప్రిల్ లో తనకు క్యాన్సర్ నిర్దారణ అయినట్లు తెలిపారు. వ్యాధి గురించి తెలియగానే చాలా కంగారు పడ్డారట. కానీ ఫ్యామిలీ, వైద్యుల ధైర్యంతో చికిత్స తీసుకున్నట్లు చెప్పారు.

New Update
Shiva Rajkumar

Shiva Rajkumar

గత కొన్నేళ్లుగా  అమెరికాలోని ఫ్లోరిడాలో మియామీ ఆస్పత్రిలో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న  కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవలే జనవరిలో చికిత్స చివరి దశకు చేరుకుందని.. త్వరలో అభిమానుల ముందుకు వస్తానని వీడియో రిలీజ్ చేశారు.  అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివరాజ్ కుమార్ తనకు క్యాన్సర్ ఎలా బయటపడింది? ఆ సమయాన్ని తాను ఎలా ఎదుర్కొన్నారు?  అనే విషయాలను పంచుకున్నారు. 

Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

ఏప్రిల్ లో క్యాన్సర్ బయటపడింది

 నటుడు శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 2024లో తాను వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని లక్షణాలు బయటపడినట్లు తెలిపారు. అయితే  ముందుగా  విశ్రాంతి లేకుండా వర్క్ చేయడం వల్ల అలా జరిగిందని అనుకున్నారట. దీంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారట. కానీ కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్ కి సంబంధించిన పరీక్షలు చేయించగా.. వ్యాధి నిర్దారణ అయినట్లు  తెలిపారు. వ్యాధి గురించి తెలియగానే ముందుగా శివరాజ్ కుమార్ చాలా కంగారు పడ్డారట. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, వైద్యులు ఇచ్చిన ధైర్యంతో చికిత్స తీసుకున్నట్లు చెప్పారు. కిమోథెరపీ తీసుకుంటూ షూట్‌లో పాల్గొన్న రోజులు ఎన్నో ఉన్నాయి. కిమోథెరపీ సమయంలో బాగా నీరసం వచ్చేసేది అని ఎమోషనల్ అయ్యారు. ‘45' సినిమా  క్లైమాక్స్‌ చూస్తే శివన్న ఎలా నటించారు? అని షాకవుతారు అంటూ క్యాన్సర్ సమయంలో తాను ఎదుర్కున్న సవాళ్ళను గురించి తెలిపారు.

Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

మార్చి 3 నుంచి శివరాజ్ కుమార్ తిరిగి షూట్స్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న RC16 షూట్ లో జాయిన్ కానున్నట్లు చెప్పారు. 

 Also Read: Boney Kapoor: ఇంట్లో అలా చేస్తే తప్పేంకాదు.. అలహాబాదియా వివాదంపై శ్రీదేవి భర్త షాకింగ్ కామెంట్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు