/rtv/media/media_files/2025/04/09/A8G7vkpP004h3F2Ctr0j.jpg)
Sharwanand nari nari naduma murari movie darsanamey lyrical video released
శర్వానంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అప్డేట్ అందించారు.
ఫస్ట్ లిరికల్ వీడియో
Also Read: మీరు ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!
Also Read: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
ఇందులో ఫస్ట్ సాంగ్ ‘దర్శనమే’ అంటూ సాగే లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో శర్వానంద్, సంయుక్త జోడీ చాలా అట్రాక్షన్‌గా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. విశాల్ చంద్రశేఖర్, సంగీతం అందించారు. యూజిన్ నైజర్ గానం ఆలపించారు. అయితే మూవీ యూనిట్ ఒక్కో అప్డేట్ అందిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. కానీ ఇప్పటి వరకు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు.
Also Read: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు
శర్వానంద్ - రామ్ అబ్బరాజు కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది శర్వానంద్ కెరీర్‌లో వస్తు్న్న 37వ చిత్రం. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాకుండా శర్వానంద్ గత చిత్రాల కంటే ఇది కాస్త భిన్నంగా ఉండబోతుందని ఇది వరకే మేకర్స్ తెలిపారు.
Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!
(actor-sharwanand | samyuktha-menon)