/rtv/media/media_files/2025/09/18/bads-of-bollywood-2025-09-18-09-20-03.jpg)
Bads of Bollywood
Bads of Bollywood: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా తన తొలి ప్రాజెక్ట్‌తో వెబ్ సిరీస్ ప్రపంచంలో అడుగుపెట్టాడు. ఆయన డైరెక్ట్ చేసిన "The Bads of Bollywood" అనే సాటిరికల్ యాక్షన్ డ్రామా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్, నిన్న గ్రాండ్ ప్రీమియర్ జరుపుకుంది. ఇక నేటి (సెప్టెంబర్ 18) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.
ఇతర వెబ్ సిరీస్‌ల మాదిరిగా అర్థరాత్రి 12 గంటలకు కాకుండా, ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ మద్యం 12:30 PM IST నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. కొంతమంది వీక్షకులు ఉదయం నుండి వెతుకుతున్నవారికి ఇప్పుడు టైమింగ్‌పై అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఇది ఓ స్పెషల్ స్లాట్‌లో రిలీజ్ కావడం విశేషం.
ఈ సిరీస్‌లో బాబీ డియోల్, లక్ష్య, సహర్ బాంబా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, ఎస్.ఎస్. రాజమౌళి వంటి స్టార్ సెలెబ్రిటీస్ స్పెషల్ కెమియోగా కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ భారీ కాంబినేషన్ చూసిన ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది.
Also Read: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!
ఈ సిరీస్‌ను ఆర్యన్ ఖాన్తో పాటు బిలాల్ సిద్దిఖీ, మనవ్ చౌహాన్ కలిసి క్రియేట్ చేశారు. కథలో హాస్యం, విమర్శ, యాక్షన్ అన్నీ కలిపి ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. యువతను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఎక్కువగా ఉండనున్నట్టు తెలుస్తోంది.
ప్రీమియర్ ఈవెంట్‌లో ఖాన్ ఫ్యామిలీ..
ముంబైలో జరిగిన ప్రీమియర్ ఈవెంట్ ఒక గ్రాండ్ సెలెబ్రేషన్‌లా మారింది. షారూక్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్, పిల్లలు సుహానా, అబ్రామ్తో కలిసి ఈ వేడుకకు హాజరై తన తనయుడు ఆర్యన్‌కి మద్దతుగా నిలిచాడు. ప్రీమియర్ సందడి, సెలెబ్రిటీల హాజరుతో ఈ ఈవెంట్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!
ఇప్పటికే ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక స్టార్ కిడ్ దర్శకుడిగా పరిచయం కావడం, అదే సమయంలో టాప్ హీరోల గెస్ట్ రోల్స్ ఉండడం సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ ప్రాజెక్ట్‌గా నిలవబోతుందా? లేక మరో హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్‌లా మిగిలిపోతుందా అన్నది కొద్ది గంటల్లో తెలుస్తుంది.
అయితే, బాలీవుడ్ వెబ్ కంటెంట్‌లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చే ప్రయత్నంగా "The Bads of Bollywood" నిలిచిందని చెప్పుకోవచ్చు. యూత్, బాలీవుడ్ ఫ్యాన్స్, క్రియేటివ్ కంటెంట్ కోరుకునే ప్రేక్షకుల కోసం ఇది ఓ మంచి ఎక్స్‌పీరియెన్స్ అవుతుందని మూవీ టీం ఆశపడుతున్నారు.సెప్టెంబర్ 18, మధ్యాహ్నం 12:30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.