Shah Rukh Khan: సౌత్ హీరోల అలా చేయడం మానుకోవాలి.. షారుక్ సంచలన కామెంట్స్!

షారుక్ ఖాన్ తాజాగా ఓ ఈవెంట్ లో సౌత్ హీరోలపై చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. సౌత్ హీరోస్ రామ్ చరణ్, అల్లు అర్జున్, యష్ వేగంగా డ్యాన్స్‌ చేయడం ఆపేయాలి. డ్యాన్స్‌ విషయంలో వారిని ఫాలో అవడం కష్టం అంటూ నవ్వులు పూయించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.

New Update
Shah Rukh Khan comments on south heroes

Shah Rukh Khan comments on south heroes

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ తాజాగా దుబాయి వేదికగా జరిగిన  ‘గ్లోబల్‌ విలేజ్‌’ కార్యక్రమానికి  హాజరై సందడి చేశారు. అక్కడ వేదికపై డాన్స్ వేసి అభిమానులను, అతిథులను అలరించారు. అయితే ఈ ఈవెంట్ లో సౌత్ హీరోలపై షారుక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు షారుక్ సౌత్ హీరోల గురించి ఏమన్నారో ఇక్కడ తెలుసుకోండి.. 

Also Read: Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!

రామ్ చరణ్, అల్లు అర్జున్ అలా చేయకండి.. 

ఈవెంట్ లో షారుక్ స్టేజ్ పై మాట్లాడుతూ.. సౌత్ ఇండియా స్టార్స్ ప్రభాస్‌, మహేశ్‌బాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, యశ్‌, రజనీకాంత్‌, ఎన్టీఆర్  విజయ్‌ తదితరులు తన స్నేహితులని తెలిపారు. వాళ్ళు వేగంగా డాన్స్ వేయడం ఆపేయాలని.. డాన్స్ విషయంలో వారిని ఫాలో అవ్వడం కష్టమంటూ నవ్వులు పూయించారు. షారుక్  ప్రభాస్, రామ్ చరణ్, రజినీకాంత్ అంటూ పేర్లు ప్రస్తావిస్తుండగా అభిమానుల అరుపులు, కేకలతో వేదిక హోరెత్తిపోయింది. 

ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!

షారుఖ్ ప్రస్తుతం కింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు. సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షారుఖ్ ఖాన్ తో పాటు  అభిషేక్ బచ్చన్,  సుహానా ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో సుహానా డెబ్యూగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే పోస్టర్ విడుదల చేయగా మంచి బజ్ వచ్చింది. 

Also Read: Daaku Maharaaj: దబిడి దిబిడే.. ఓటీటీలోకి బాలయ్య డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Also Read: Cholesterol: ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ శరీరంలో కొవ్వు పెరుగుతుందని అర్థం జాగ్రత్త..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు