Sankranthiki Vasthunnam Remake: హిందీలోకి “సంక్రాంతికి వస్తున్నాం” రీమేక్.. హీరో ఎవరంటే..?

విక్టరీ వెంకటేష్ హిట్ సినిమా "సంక్రాంతికి వస్తున్నాం" హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ కానుంది. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించనుండగా, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నాడు. ప్రస్తుతం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

New Update
Sankranthiki Vasthunnam Remake

Sankranthiki Vasthunnam Remake

Sankranthiki Vasthunnam Remake: విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను దిల్ రాజు నిర్మించారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ROI (Return on Investment) పరంగా కూడా సూపర్ హిట్ అయ్యింది.

Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!

Akshay Kumar Sankranthiki Vasthunnam Remake

ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతకాలంగా ఈ ప్రాజెక్టుపై రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ, తాజాగా ఈ రూమర్స్ మరింత పెరిగాయి. అక్షయ్ కుమార్(Akshay Kumar) ఈ రీమేక్‌లో హీరోగా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ హిందీ వెర్షన్‌ను దర్శకుడు అనీస్ బాజ్మీ డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం.

Also Read: రజనీకాంత్ "కూలీ" టీవీ ప్రీమియర్‌కు రెడీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..?

అనీస్ బాజ్మీ ఎంట్రీతో హైప్..

అనీస్ బాజ్మీ హిందీలో "భూల్ భులైయా 2", "సింగ్ ఇజ్ కింగ్" లాంటి హిట్ కామెడీ ఎంటర్టైనర్స్ ఇచ్చిన దర్శకుడు. ఆయన తీస్తున్నాడంటే, హిందీ రీమేక్‌కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ ఇవ్వనున్నాడని అర్థమవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.

Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్..!

మళ్లీ దిల్ రాజు- శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

తెలుగులో “సంక్రాంతికి వస్తున్నాం”ను నిర్మించిన దిల్ రాజు, హిందీ రీమేక్‌ను కూడా తానే నిర్మించనున్నారని సమాచారం. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ హిందీ వెర్షన్‌ను మళ్ళీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!

ఓటీటీ ప్రభావంతో, పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో హిందీ రీమేక్‌లు పెద్దగా సక్సెస్ కావడం లేదు. గతంలో చాలా రీమేక్‌లు ఫెయిలయ్యాయి. ఈ నేపథ్యంలో “సంక్రాంతికి వస్తున్నాం” రీమేక్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో “సంక్రాంతికి వస్తున్నాం” హిందీ వెర్షన్ వస్తుందన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాల్సిందే!

Advertisment
తాజా కథనాలు