Coolie TV Premiere: రజనీకాంత్ "కూలీ" టీవీ ప్రీమియర్‌కు రెడీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..?

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన "కూలీ" సినిమా అక్టోబర్ 19 సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో ప్రీమియర్ కానుంది. నాగార్జున విలన్‌గా, ఆమిర్ ఖాన్ కేమియోలో కనిపించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అనిరుధ్ సంగీతం సినిమాకు హైలైట్.

New Update
Coolie TV Premiere

Coolie TV Premiere

Coolie TV Premiere: సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటించిన "కూలీ" సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టినా ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ పొందింది. అయితే, బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు ఈ సినిమాను ఓటిటి రిలీజ్ తర్వాత టీవీలో చూడాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. "కూలీ" సినిమాను జెమినీ టీవీ అక్టోబర్ 19, 2025 సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్‌గా ప్రసారం చేయనుంది.

Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్..!

Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!

సినిమా కథ సింపుల్‌గా.. 

ఈ సినిమా కథ విశాఖపట్నం పోర్ట్ లో మొదలవుతోంది. అక్కడ "కింగ్‌పిన్ లాజిస్టిక్స్" పేరుతో సైమన్ అనే డాన్ (నాగార్జున) అక్రమ వ్యాపారాలు చేస్తుంటాడు. అతని గ్యాంగ్‌లో దయాల్ (సౌబిన్ షాహిర్) అనే కీలక వ్యక్తి ఉండటం, ఓ సంఘటనలో రాజశేఖర్ (సత్యరాజ్) అనే సాధారణ ఉద్యోగిని దయాల్ చంపడం కథలో మలుపు తిప్పుతుంది. ఈ ఘటన తర్వాత 30 ఏళ్లకు దేవా (రజనీకాంత్) వైజాగ్‌కి తిరిగి వస్తాడు. అతను ఎవరి కోసం వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అనేదే కథలో అసలు ట్విస్ట్. 

Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున విలన్ పాత్రలో మెప్పించారు. ఆమిర్ ఖాన్ కేమియో పాత్రలో కనిపించగా, శ్రుతి హాసన్, ఉపేంద్ర, రచితా రామ్ లాంటి నటులు కూడా కథకు బలం చేకూర్చారు. అనిరుధ్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. ఆయన ఇచ్చిన మాస్ బీజీఎం, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Also Read: 'కొత్త లోక' ఓటీటీకి ఎప్పుడంటే? ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది!

సినిమాలో రజనీకాంత్ మళ్లీ తన స్టైల్, డైలాగ్ డెలివరీ, ఫైటింగ్ సీన్లతో ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కిచ్చారు. ఈ సినిమా ఫస్ట్ డే నుంచే థియేటర్ల వద్ద జోష్ కనిపించింది. అయితే, కథలో కొంత మందికి నచ్చని అంశాలు ఉండడంతో రివ్యూలు మిక్స్డ్‌గా వచ్చాయి.

"కూలీ" సినిమాను థియేటర్‌లో మిస్ అయిన వారు, మళ్లీ మాస్ మేజిక్‌ను ఆస్వాదించాలనుకునేవారు అక్టోబర్ 19న రాత్రి 6 గంటలకు జెమినీ టీవీ చానెల్‌లో తప్పక చూడండి.

Advertisment
తాజా కథనాలు