Rashmika: కొత్త అవతారమెత్తిన రష్మిక.. 'ఏసుబాయిగా' ఛావా ఫస్ట్ లుక్

రష్మిక ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నలేటెస్ట్ మూవీ 'ఛావా'. అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక ఛత్రపతి శివాజి భార్య ఏసుబాయి పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు రేపు మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

New Update
Chhaava rashmika

Chhaava rashmika

Also Read: Dil Raju: ఐటీ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. దిల్ రాజు సతీమణితో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించిన అధికారులు!

రష్మిక లుక్ పోస్టర్.. 

అయితే తాజాగా ఈ నుంచి రష్మిక లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ప్రతి రాజు వెనుక అసమానమైన బలం కలిగిన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వపడే మహారాణి యేసుబాయి.. అంటూ రష్మిక పాత్రను రివీల్ చేశారు. ఇందులో రష్మిక ఛత్రపతి శివాజి సతీమణి మహారాణి ఏసుబాయి పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు మూవీ ట్రైలర్ లాంచ్ డేట్ కూడా ప్రకటించారు. 'ఛావా' ట్రైలర్ రేపు విడుదల కానున్నట్లు తెలియజేశారు. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రస్తుతం రష్మిక 'చావా ' సినిమాతో పాటు హిందీలో సికిందర్, థామ చిత్రాలు చేస్తోంది. ఇటు తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్, కుబేర సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ అవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. 

Also Read: Kiran Abbavaram: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు