అల్లు అర్జున్‌కి మాస్ వార్నింగ్.. ఈసారి 1500 మందితో ఉరికించి కొడతాం!

అల్లు అర్జున్‌కి ఓయూ జేఏసీ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ టైం 1500 మందితో దాడి చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి రూ.25 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ తప్పు జరిగినా జేఏసీ ఉరికించి కొడతాదని అన్నారు.

New Update
ou jac leaders mass warning to allu arjun

ou jac leaders mass warning to allu arjun Photograph: (ou jac leaders mass warning to allu arjun)

అల్లు అర్జున్ ఇంటిపై నిన్న (ఆదివారం) ఓయూ జేఏసీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నిందితులుగా ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఆదివారం రాత్రి ఓయూ జేఏసీ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

అనంతరం అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 మూవీ టీంకు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి 15 మందితో దాడి చేశాం.. నెక్స్ట్ టైం 1500 మందితో దాడి చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి రూ.25 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Also Read: ధమ్ బిర్యానీలో బ్లేడ్.. హాస్పిటల్ పాలైన కస్టమర్!

అలాగే హీరోయిన్ రష్మిక మందన్నా కూడా రూ.15 లక్షలు ఇవ్వాలన్నారు. ఇందులో ఏ తప్పు జరిగినా ఓయూ జేఏసీ అస్సలు సహించదని.. ఉరికించి కొడతాదని అన్నారు. అంతేకాకుండా సినిమాను ఆడనివ్వకుండా చేస్తాదని పేర్కొన్నారు. ఇవాళ 15 మంది వచ్చారు.. ఈ సారి 1500 మందితో వచ్చి దాడి చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఓయూ జేఏసీ నాయకుల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

నిందితులు అరెస్ట్

దాడి చేసిన రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్‌గా జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. ఈ ఆరుగురుని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి నిందితులపై BNS 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఈ ఆరుగురికి రిమాండ్ విధించింది.

నిందితులకు కోర్టులో ఊరట

తాజాగా ఈ ఆరుగురు నిందితులకు కోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి చేసిన ముగ్గురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ఉదయం వనస్థలిపురంలోని కమలానగర్ లో జస్టిస్ ముందు ప్రవేశ పెట్టగా.. ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. 

Advertisment
తాజా కథనాలు