నాకు యాక్టింగ్ రాదు, నేనొక చెత్త నటిని.. సమంత షాకింగ్ కామెంట్స్

'సిటాడెల్‌: హనీ బన్ని’ ట్రైలర్‌ లాంచ్ సందర్భంగా సమంత తన మొదటి సినిమా కోసం జరిగిన ఆడిషన్స్‌ను గుర్తుచేసుకున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో చెత్తనటిగా నటించాలి. నేను ఆ ఆడిషన్‌ బాగా ఇచ్చాను. ఎందుకంటే ఇప్పటికీ నేను సగభాగం చెత్త నటినే అంటూ నవ్వుతూ చెప్పారు.

fs
New Update

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత తాజాగా ఓ ఈవెంట్ లో తనకు యాక్టింగ్ రాదని, తాను ఒక చెత్త నటి అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె లీడ్ రోల్ లో నటించిన 'సిటాడెల్  హనీ బన్ని’ ట్రైలర్‌ తాజగా విడుదలైంది. ఈ ట్రైలర్ లో సమంత యాక్షన్ స్టంట్స్ తో అదరగొట్టేసింది. ఈ సిరీస్‌లో ఆమె స్పై ఏజెంట్‌గా మారడానికి ముందు నటి కావాలని ప్రయత్నించినట్లు ట్రైలర్‌లో చూపించారు.

Also Read : అఖండ ఖాతాలో అరుదైన రికార్డు.. అది బాలయ్యకే సాధ్యమంటున్న అభిమానులు!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత ఈ సన్నివేశం గురించి ప్రస్తావిస్తూ.. తన మొదటి సినిమా కోసం జరిగిన ఆడిషన్స్‌ను గుర్తుచేసుకుంది." నా తొలి చిత్రం 'ఏ మాయ చేశావే' సమయంలో జరిగిన ఆడిషన్‌కు ‘సిటాడెల్‌: హనీ బన్ని’లో జరిగిన ఆడిషన్‌కు చాలా వ్యత్యాసం ఉంది. ఈ వెబ్‌ సిరీస్‌లో చెత్తనటిగా (నటించడం రాని అమ్మాయిగా) నటించాలి. నేను ఆ ఆడిషన్‌ బాగా ఇచ్చాను. 

Also Read : బోయపాటి, థమన్ లను కలిపిన బాలయ్య..

ఇప్పటికీ చెత్త నటినే..

ఆ సన్నివేశంలో బాగా నటించా ఎందుకంటే ఇప్పటికీ నేను సగభాగం చెత్త నటినే (నవ్వుతూ). ఇప్పటికీ నేను అలానే ఉన్నాను. నేను నా బెస్ట్‌ ఇచ్చానంటే క్రెడిట్‌ అంతా నాకు మాత్రమే సొంతం కాదు. సరైన టీమ్‌ చేతుల్లో పడ్డప్పుడే మనలోని మంచి నటన బయటకు వస్తుంది" అంటూ చెప్పుకొచ్చింది.

Also Read : అల్లు అర్జున్ కోసం అభిమాని భారీ సాహసం.. ఏకంగా ఏం చేశాడంటే?

 దీంతో సమంత చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక 'సిటాడెల్' వెబ్ సిరీస్ విషయానికొస్తే.. ఫ్యామిలీ మ్యాన్, ఫర్ జీ వెబ్ సిరీస్ లను డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డీకే దీన్ని తెరకెక్కించారు. సమంత, వరుణ ధావన్ లీడ్ రోల్స్ లో నటించారు. నవంబర్ 7 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 

Also Read : జాన్వీ, శ్రద్ధా.. నాని కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరంటే?

#samantha #citadel
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe