Balayya : బోయపాటి, థమన్ లను కలిపిన బాలయ్య..

'అఖండ' రిలీజ్ తర్వాత బోయపాటి, థమన్ మధ్య గొడవ జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గొడవను బాలయ్య సర్దుమణిగేలా చేశారట. అందుకే 'అఖండ' ను మించి పార్ట్-2 లో మ్యూజిక్ ఉండాలని థమన్ ను ఎంచుకున్నారట. ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

New Update
bb

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబోలో వచ్చిన 'అఖండ' చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ కోసం బోయపాటి డివోషనల్ కాన్సెప్ట్ తీసుకోవడం, అందులో బాలయ్యను అఘోరగా చూపించడం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశాయి.

Also Read : అల్లు అర్జున్ కోసం అభిమాని భారీ సాహసం.. ఏకంగా ఏం చేశాడంటే?

థమన్ బీజీయం కోసమే ఈ మూవీని ఆడియన్స్ రిపీట్ మోడ్ లో చూశారంటే.. ఆయన మ్యూజిక్ సినిమాపై ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే అఖండ రిలీజ్ తర్వాత బోయపాటి శ్రీను ఓ ఇంటర్వ్యూలో థమన్ ను ఉద్దేశిస్తూ అతని మ్యూజిక్ పై కామెంట్స్ చేశాడు. 'అఖండ అనే సినిమా మ్యాజిక్ లేకపోయినా హిట్ అవుతుంది' థమన్ మ్యూజిక్ వల్ల కాదు, కథలో ఉన్న కంటెంట్ అలాంటింది. 

Also Read : జాన్వీ, శ్రద్ధా.. నాని కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరంటే?

ఆ కంటెంట్ కు మ్యూజిక్ లేకపోయినా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని అన్నాడు. దాంతో బోయపాటి - థమన్ మధ్య చెడిందని, తన మ్యూజిక్ గురించి బోయపాటి కామెంట్ చేయడం నచ్చకపోవడంతో థమన్.. ఆయనపై కోప్పడ్డారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కట్ చేస్తే.. ఇప్పుడు అఖండ-2 కు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను ఎంచుకున్నారు. నేడు 'అఖండ' సీక్వెల్ కు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. 

Also Read : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. Mr.పర్ ఫెక్ట్ రీ రిలీజ్

బాలయ్య వల్లే ఇదంతా..

‘అఖండ 2 - తాండవం’ పేరుతో సీక్వెల్‌ తెరకెక్కనుంది. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. శివలింగం, రుద్రాక్షలు, హిమాలయాలు ఆధ్యాత్మికత అంశాలతో పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లోనే థమన్ పేరు కనిపించింది. దీంతో థమన్ - బోయపాటి మధ్య గొడవలు సర్దుమణిగినట్లు తెలుస్తోంది.

Also Read : 'అఖండ 2 - తాండవం'... మాస్ డైలాగ్ తో ఇరగదీసిన బాలయ్య.. వీడియో వైరల్

అందుకు కారణం బాలయ్య అనే టాక్ బయటికొచ్చింది. థమన్ - బోయపాటి ఇద్దరిని పిలిపించి వాళ్ళతో కూర్చొని మాట్లాడి గొడవను సర్దుమణిగేలా చేశారట. అందుకే 'అఖండ' ను మించి పార్ట్-2 లో మ్యూజిక్ ఉండాలని థమన్ ను ఎంచుకున్నారట. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు