/rtv/media/media_files/2024/10/16/1vsHmKrT7XkRGrkzabs1.jpg)
'పుష్ప' మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ పాన్ వరల్డ్ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా సౌత్ లోనే పాపులర్ అయిన బన్నీ పేరు.. 'పుష్ప' తో నార్త్ లోనూ మారుమోగిపోయింది. అటు విదేశాల్లోనూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ వీరాభిమాని అల్లు అర్జున్ ను కలిసేందుకు భారీ సాహసమే చేశాడు.
Also Read : జాన్వీ, శ్రద్ధా.. నాని కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరంటే?
ఏకంగా 1600 కిలో మీటర్లు..
అల్లు అర్జున్‌ను కలిసేందుకు సైకిల్‌పై ఏకంగా ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చాడు. యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. దీంతో అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు.
Also Read : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. Mr.పర్ ఫెక్ట్ రీ రిలీజ్
పుష్ప-2 ప్రమోషన్స్ కోసం యూపీకి వస్తే కచ్చితంగా కలుస్తానని ఐకాన్ స్టార్ అతనితో అన్నారు. తనను కలిసిన అభిమానికి అల్లు అర్జున్ మొక్కను బహుమతిగా ఇచ్చాడు. అతనికి మంచి భోజనం పెట్టించి.. తిరిగి బస్సులో బన్నీ తన సిబ్బందికి సూచించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : 'అఖండ 2 - తాండవం'... మాస్ డైలాగ్ తో ఇరగదీసిన బాలయ్య.. వీడియో వైరల్
"DEMI GOD" for his fans. Apt 🙏🙏🙏
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) October 16, 2024
A fan from north India uttarpradesh, aligarh city came to meet his hero on cycle.🙏
He is trying to meet from last few days
Finally A fan moment for him! ♥️
LOVE YOU ICON @alluarjun 🙌 pic.twitter.com/WJdogwJxWQ
నిజానికి గతంలోనూ పలువురు బన్నీ ఫ్యాన్స్ ఆయన్ని కలిసేందుకు వచ్చారు. కానీ వాళ్లంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే. కానీ మొట్ట మొదటి సారి ఇతర రాష్ట్రం అదికూడా ఉత్తర ప్రదేశ్ నుంచి అల్లు అర్జున్ కోసం రావడం విశేషం. దీన్ని బట్టి నార్త్ లోనూ బన్నీకి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది.
Also Read : సీఎం రేవంత్ ను కలిసిన రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్.. ఎందుకో తెలుసా!?