Samantha: అయ్యో.. సమంతకి ఏమైంది? హాస్పిటల్ బెడ్ పై సెలైన్ బాటిల్ తో..

నటి సమంత హాస్పిటల్ బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటో నెట్టింటి వైరల్ గా మారింది. ఈ ఫొటోకు సామ్ 'రికవరీ' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఇది చూసిన ఆమె ఫ్యాన్స్  సమంతకు మళ్ళీ ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు.

New Update
samantha on hospital bed

samantha on hospital bed

Samantha: నటి సమంత తరచూ సోషల్ మీడియాలో తన వర్క్ లైఫ్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సామ్ తన డే రొటీన్ కి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే సామ్ హాస్పిటల్ బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటో నెట్టింటి వైరల్ గా మారింది. ఈ ఫొటోకు సామ్ 'రికవరీ' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఇది చూసిన ఆమె ఫ్యాన్స్  సమంతకు మళ్ళీ ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే 2022లో 'మయోసిటిస్' అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపిన సమంత..  కొంతకాలంగా దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగానే సామ్ ఆ ఫొటోను షేర్ చేసినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?

Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!

 ఇదిలా ఉంటే ఓ వైపు ఆరోగ్యంపై దృష్టి పెడుతూనే మరోవైపు రెగ్యులర్ షూటింగ్స్ లో పాల్గొంటుంది సామ్.  ఇటీవలే సిటాడెల్ సీరీస్ తో ప్రేక్షకుల ను అలరించింది.  అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సీరీస్ విపరీతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ ట్రాలలా బ్యానర్ పై  'మా ఇంటి బంగారం'  సినిమా చేస్తోంది. అలాగే రక్త బ్రహ్మాండ అనే వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది. 

 Also Read: Boney Kapoor: ఇంట్లో అలా చేస్తే తప్పేంకాదు.. అలహాబాదియా వివాదంపై శ్రీదేవి భర్త షాకింగ్ కామెంట్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు