/rtv/media/media_files/2025/04/20/HrVZL0jghhjH7iCBljZf.jpg)
Samantha - Raj Nidimoru
Samantha: నటి సమంత తన సొంత ప్రొడక్షన్ కంపెనీ ట్రాలాలా బ్యానర్ పై రూపొందించిన తొలి చిత్రం 'శుభం' మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా సమంత మూవీ టీమ్ తో కలిసి తిరుమలను దర్శించుకున్నారు. అయితే ఇందులో సమంతతో పాటు డైరెక్టర్ రాజ్ నిడిమోర్ కూడా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు సాంప్రదాయ వస్త్రాల్లో ఆలయ ప్రాంగణంలో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read: Mad Square OTT: థియేటర్లలో హిట్ కొట్టిన ‘మ్యాడ్ స్క్వేర్’.. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్?
పెళ్లి కోసమేనా?
గత కొద్దిరోజులుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు వస్తున్న.. నేపథ్యంలో ఇద్దరు కలిసి తిరుపతిలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే తిరుపతికి వెళ్లారా? అని అనుకుంటున్నారు. మరోవైపు సమంత అభిమానులు మాత్రం.. కేవలం ప్రొఫెషనల్ పరంగా మాత్రమే వాళ్ళు కలిసి వెళ్లారు, అంతేకానీ వారి మధ్య ఏమీలేదని వాదిస్తున్నారు. కొంతకాలంగా సమంత- రాజ్ నిడిమోర్ డేటింగ్ పుకార్లు తెగ వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ వీరిద్దరూ దీని గురించి ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో అందరూ పలు రకాలుగా అనుకుంటున్నారు.
திருப்பதியில் நடிகை சமந்தா.. தனது தயாரிப்பில் வெளியாகும் முதல் படமான சுபம் திரைப்பட குழுவுடன் சாமி தரிசனம்..!#Tirupati | #Tirumala | #Temple | #ActressSamantha | #PolimerNews pic.twitter.com/EfP2AD79Mz
— Polimer News (@polimernews) April 19, 2025
సమంత- రాజ్ కలిసి రెండు సినిమాలు చేశారు. 'సిటాడెల్: హనీ బన్నీ' (2024), 'ది ఫ్యామిలీ మ్యాన్' సీరీస్ లకు రాజ్ దర్శకత్వం వహించారు. అంతేకాదు సామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' సీరీస్ కూడా రాజ్ తెరకెక్కిస్తున్నారు.
telugu-news | cinema-news | latest-news | samantha - raj nidimoru
NTR-NEEL Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బర్త్‌డే గిఫ్ట్.. #NTRNEEL టైటిల్, ఫస్ట్ లుక్ రెడీ..!