/rtv/media/media_files/2025/04/20/HdeS9jIw4VnzNeUCKBeL.jpg)
NTR-NEEL Update
NTR-NEEL Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎన్టీఆర్-నీల్ ఒకటి. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో 29వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఎన్టీఆర్ పాల్గోనని సన్నివేశాలతోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. అయితే తారక్ కూడా త్వరలోనే సెట్స్‌లో జాయిన్ కానున్నట్టు సమాచారం.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..
మేలో ఫస్ట్ లుక్ పోస్టర్..
ఇక ‘సలార్’ సినిమా షూటింగ్ ప్రారంభించిన కొద్దికాలంలోనే ఫస్ట్ లుక్ విడుదల చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విషయంలోనూ అదే స్టైల్ ఫాలో అవుతాడని ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మే నెలలో, ఎన్టీఆర్ పుట్టినరోజు(NTR Birthday) సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ ఫస్ట్ లుక్‌తో పాటు సినిమాకు టైటిల్ కూడా అదే రోజు ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల చెబుతున్నాయి.
Also Read: ఫ్యాన్స్ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..
అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. తారక్ ఫ్యాన్స్ మాత్రం ఈ అప్డేట్ కోసం ఇప్పటికే కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు!
Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Anna Birthday ki Neel Nunchi vocche update kosam piccha waiting...#NTRNeel #NTRBirthdayMonth pic.twitter.com/Zh7gS600YM
— JAGADEESH.NTR (@jajjujakpot1) May 8, 2024