Samantha: జీవిత భాగస్వామి పై సమంత సంచలన పోస్ట్..!

సామ్ తాజాగా తన ఇన్స్టా స్టోరీలో రిలేషన్ షిప్ గురించి షేర్ చేసిన ఓ సందేశాత్మక వీడియో వైరలవుతోంది. భాగస్వామితో మంచి బంధాన్ని కలిగి ఉన్నప్పటికీ.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఏదో ఒక సమయంలో ఆవ్యక్తిని కోల్పోవాల్సిందే అని ఆ వీడియో సారాంశం.

New Update
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu Photograph: (Samantha Ruth Prabhu)

Samantha: గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో  సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. మళ్ళీ బ్యాక్ టూ ఫార్మ్ లోకి వచ్చారు. సినిమా షూటింగ్స్ రెగ్యులర్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే సిటాడెల్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సీరీస్ విపరీతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. మరోవైపు తన సొంత ప్రొడక్షన్ లో ఓ సినిమా కూడా స్టార్ట్ చేశారు సామ్
 
Also Read: Boney Kapoor: ఇంట్లో అలా చేస్తే తప్పేంకాదు.. అలహాబాదియా వివాదంపై శ్రీదేవి భర్త షాకింగ్ కామెంట్స్!

ఇదిఇలా ఉంటే సమంత తరచూ  సోషల్ మీడియాలో తన వ్యక్తిగతం, సినిమాకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు కొన్ని సందేశాత్మక కొటేషన్ లు, వీడియోలను కూడా పంచుకుంటుంటారు. అయితే తాజాగా సామ్ తన ఇన్స్టా స్టోరీలో రిలేషన్ షిప్ గురించి  షేర్ చేసిన ఓ  సందేశాత్మక వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 

Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!

సామ్ రిలేషన్ షిప్ వీడియో 

మీరు మీ భాగస్వామితో మంచి బంధాన్ని కలిగి ఉండవచ్చు. మంచి బంధం నిజమైన ప్రేమ అన్ని రకాల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే.. మీ భాగస్వామి కోరుకున్న విధంగా కనిపించలేరు. ఎదుటి వ్యక్తి చక్కగా ఉన్నారని అనుకుంటాం.. కానీ మన మనసు, శరీరం ఎలా ఉంది అనేది గుర్తించం. అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక సమయంలో ఆ వ్యక్తిని కోల్పోవాల్సిందే అని  ఆమె షేర్ చేసిన వీడియో సారాంశం.  సామ్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?

Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్‌.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం

#telugu-news #samantha #Latest News
Advertisment
Advertisment
తాజా కథనాలు