/rtv/media/media_files/2025/06/28/samantha-latest-photos-2025-06-28-19-40-27.jpg)
Samantha latest photos
Samantha: సామ్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలోనే వరుస సినిమాలు, విజయాలతో హీరోలకు దీటుగా స్టార్ డమ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇలా కెరీర్ పీక్స్ లో ఉండగానే సామ్ వ్యక్తిగత జీవితంలో, ఆరోగ్యపరంగా అతిపెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నారు. 2022లో సమంతకు మయోసైటిస్ సామ్ మాయోసైటీస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడ్డారు. దీంతో కొంతకాలం సినిమాలకు దూరమైన సామ్.. పూర్తి సమయాన్ని తన ఆరోగ్యానికి కేటాయించారు. ఈ సమయంలో ఆమెకు చాలా మంది.. ఇక యాక్టింగ్ కెరీర్ ముగిసిపోయిందని, వేరే "ప్లాన్ బీ" చూసుకోమని సలహా ఇచ్చారట. కానీ సమంత మాత్రం వెనక్కి తగ్గలేదు. అనారోగ్య సమస్యల నుంచి పోరాడి మళ్ళీ అంతే స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ ఇచ్చింది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/28/samantha-2025-06-28-19-58-05.jpg)
మళ్ళీ బిజీ అవుతున్న సామ్
యోగా, వ్యాయామాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ఆరోగ్య సమస్యల నుంచి కొంత కోలుకున్న.. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇటీవలే సామ్ ప్రొడ్యూసర్ గా రూపొందిన తొలి సినిమా 'శుభం' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనికి ముందు ఆమె నటించిన 'సిటాడెల్: హనీ బన్నీ సీరీస్ కూడా అద్భుత విజయం సాధించింది.
Also Read: మళ్లీ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
ఇవి మాత్రం కాదు నెక్స్ట్ లైనప్ ప్రాజెక్ట్స్ తో సిద్ధంగా ఉంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే డ్రామా సిరీస్‌లో నటిస్తోంది. అలాగే తన సొంతం ప్రొడక్షన్ లో 'మా ఇంటి బంగారం' అనే సినిమా కూడా చేస్తోంది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/28/sam-2025-06-28-19-59-59.jpg)
ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో అదరగొడుతుంది సామ్. తాజాగా బ్లాక్ థై స్లిట్ గౌన్ లో స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలపై సెలెబ్రెటీలు, ఫ్యాన్స్ లైకుల, కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Shafali Jariwala: 15 ఏళ్ల వయసులోనే ఆ వ్యాధి.. 42 ఏళ్లకు మృతి! షెఫాలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే