/rtv/media/media_files/2025/06/28/shafali-jariwala-suffering-with-epilepsy-from-the-age-15-2025-06-28-17-47-42.jpg)
Shafali Jariwala suffering with Epilepsy from the age 15
Shafali Jariwala: 'కాంటా లగా' పాటతో సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా 42 ఏళ్ల వయసులో మృతిచెందింది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఆమె గుండెపోటుతో కన్నుమూసినట్లు నివేదికలు చెబుతున్నాయి.షెఫాలీ ఆకస్మిక మరణం సినీ పరిశ్రమను, అభిమానులను షాక్ కి గురిచేసింది.
15 ఏళ్ల వయసులో మూర్ఛ వ్యాధి
ఇదిలా ఉంటే షెఫాలీ చిన్న వయసు నుంచే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు గతంలో పలు ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన ఆరోగ్యం గురించి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. 15 సంవత్సరాల వయసు నుంచి తాను ఎపిలెప్సీ (మూర్ఛ వ్యాధి)తో పోరాడుతున్నట్లు తెలిపింది. స్కూల్లో, రోడ్ల మీద నడిచేటప్పుడు తనకు మూర్ఛ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు ఈ సమస్య తలెత్తెదని చెప్పారు. ఆ తర్వాత సరైన జీవశైలి, యోగా, శ్వాస వ్యాయామాలు, రెగ్యులర్ వర్కౌట్‌ల ద్వారా తాను ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.
‘కాంటా లగా’ తో కెరీర్
2000ల ప్రారంభంలో విజయవంతమైన ‘కాంటా లగా’ మ్యూజిక్ వీడియోలో తన నటనకు షెఫాలీ జరివాలా బాగా పేరు తెచ్చుకుంది. ఈ పాట ఆమెకు ‘కాంటా లగా గర్ల్’ అనే బిరుదును కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె సల్మాన్ ఖాన్ ముజ్సే షాదీ కరోగిలో నటించింది. అలాగే ‘హుడుగారు’ అనే సినిమాలో కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి ఓ పాటలో డ్యాన్స్ చేశారు.
బుల్లితెర పై కూడా
అనంతరం శెఫాలీ కేవలం మ్యూజిక్ వీడియోలకే పరిమితం కాకుండా, టీవీ షోలలో కూడా కనిపించారు. ఆమె సల్మాన్ హోస్ట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ 13లో కూడా పాల్గొంది. 2004లో షెఫాలి మీట్ బ్రదర్స్ ఫేమ్ సంగీతకారుడు హర్మీత్ సింగ్‌ను వివాహం చేసుకుంది. కానీ 2009లో విడిపోయింది. 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో వివాహం చేసుకుంది.