/rtv/media/media_files/2025/10/14/salman-khan-2025-10-14-12-37-34.jpg)
Salman Khan
Salman Khan: టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన క్రాస్-ఓవర్ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి(Vamsi Paidipally), బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌తో సినిమా చేయబోతున్నారని ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఇది చర్చల దశలో ఉన్నప్పటికీ, ఇరు వైపులా ఆసక్తి ఉండడంతో ప్రాజెక్ట్ కుదిరే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
వంశీ పైడిపల్లి గతంలో విజయ్‌తో చేసిన వారసుడు తర్వాత కొత్త సినిమా ప్రకటించలేదు. అయితే, ఇప్పుడు ఆయన బాలీవుడ్‌కి అడుగుపెడతారా అనే ఆసక్తికర చర్చ మొదలైంది. ఆయన రూపొందించిన కథ సల్మాన్ ఖాన్‌కు బాగా నచ్చిందని, ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్..!
ఈ భారీ సినిమా నిర్మాణ బాధ్యతలు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dill Raju) తీసుకోనున్నారని సమాచారం. దిల్ రాజు ఇప్పటికే తెలుగు సినిమాల్లో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన బడా నిర్మాత. 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి హిట్ తర్వాత, ఇప్పుడు బాలీవుడ్‌లో తన ముద్ర వేయాలని ఈ ప్రాజెక్ట్‌తో ప్రయత్నిస్తున్నారట.
Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!
యాక్షన్, డ్రామా, ఎమోషన్..
ఇది యాక్షన్, డ్రామా, ఎమోషన్ అన్నీ కలగలిపిన మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని ఫిలింసర్కిల్స్ చెబుతున్నాయి. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాలేదు కానీ, అన్ని అనుకున్నట్టే జరిగితే ఇది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!
మొత్తంగా చూస్తే, సల్మాన్‌ఖాన్ ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాపులతో ఎదురుదెబ్బలు తింటున్నారు. సికిందర్ వంటి భారీ అంచనాల చిత్రం నిరాశపరిచింది. ట్రెండ్‌కి తగ్గ కథలతో రాలేకపోవడం ఆయన కెరీర్‌కు మినస్ అయింది. ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్, దర్శకుల టాలెంట్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారట.
Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..
ఇలాంటి సమయంలో వంశీ పైడిపల్లి లాంటి డైరెక్టర్ తో కలిసి పనిచేయాలనుకోవడం, అతని కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చూస్తే... ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలోనూ అంచనాలు పెరిగే అవకాశం ఉంది.
ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అనేది చూడాల్సిందే. అధికారిక ప్రకటన వెలువడితే టాలీవుడ్ & బాలీవుడ్‌లో ఈ వార్త ఫుల్ వైరల్ అవడం ఖాయం.