Saif Ali Khan: సైఫ్ పై దాడి.. నిందితుడి అరెస్ట్, ఎక్కడ దొరికాడంటే?

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు పోలీసుల చేతికి చిక్కాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ వద్ద రైల్వే పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులతో వీడియో కాల్ ద్వారా సంప్రదించి నిందితుడు అతనేనని ధ్రువీకరించారు.

New Update
accused in saif ali khan attack

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు పోలీసుల చేతికి చిక్కాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ వద్ద రైల్వే పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ముంబై నుంచి బిలాస్‌పూర్ వెళ్తున్న సమయంలో జనరల్ బోగీలో ప్రయాణిస్తుండగా అతడిని గుర్తించి పట్టుకున్నారు. 

వెంటనే ముంబై పోలీసులతో వీడియో కాల్ ద్వారా సంప్రదించి నిందితుడి గుర్తింపును ధ్రువీకరించారు. ప్రస్తుతం నిందితుడు రైల్వే పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని తీసుకొచ్చేందుకు ముంబయి పోలీసులు బయలుదేరి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్నట్లు సమాచారం.

Also Read :  సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై బాంద్రాలో ఉన్న సైఫ్ నివాసంలో ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే, ఆ సమయంలో సైఫ్ మేల్కొని అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా, దొంగ కత్తితో దాడి చేసి సైఫ్‌ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నెముకతో పాటు శరీరంపై ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. వెంటనే సైఫ్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని హాస్పిటల్ కి తరలించాడు.

 సైఫ్ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, వెన్నుముక భాగంలో పొడవడంతో అందులో ఉండే ద్రవం బయటకు వచ్చింది. అందులో ఉన్న కత్తిని బయటకు తీసి గాయాన్ని సరి చేశామని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అలాగే అతని మెడ, చేతులపై ప్లాస్టిక్ సర్జరీలు చేశారు.సైఫ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Also Read :  జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. MAAకు మాధవీలత ఫిర్యాదు

Advertisment
తాజా కథనాలు