Sachin Tendulkar: అద్భుతం, కన్నీళ్లొచ్చాయి: ‘సితారే జమీన్‌ పర్‌’పై సచిన్‌

అమీర్ ఖాన్ ‘సితారే జమీన్‌ పర్‌' పై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలకు కురిపించారు. గురువారం స్పెషల్‌ స్క్రీనింగ్‌కు హాజరైన సచిన్ తనకు ఈ సినిమా బాగా నచ్చిందంటూ కితాబిచ్చారు. చివరి వరకూ చాలా భావోద్వేగభరితంగా ఉందని చెప్పారు.

New Update

Sachin Tendulkar: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'సితారే జమీన్ పర్' రేపు, జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఆమిర్ ఖాన్ తన సన్నిహితులు, స్నేహితుల కోసం 'సితారే జమీన్ పర్' ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయగా.. దీనికి  క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Also Read: Ek Din Teaser: అమీర్ ప్లాన్ వేరే లెవెల్.. 'సితారే జమీన్ పర్' చిత్రంలో సాయి పల్లవి- జునైద్ 'ఏక్ దిన్' టీజర్

సచిన్ ప్రశంసలు 

కాగా, సినిమా చూసిన తర్వాత సచిన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.  'సితారే జమీన్ పర్'  పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తనకు బాగా నచ్చిందంటూ కితాబిచ్చారు. చివరి వరకూ చాలా భావోద్వేగభరితంగా ఉందని చెప్పారు. 'సితారే' టీమ్‌తో పాటు సినిమా చూసే ప్రేక్షకులు కూడా అలాంటి భావోద్వేగాన్నే పొందుతారని తెలిపారు. నటీనటులందరూ అద్భుతంగా నటించారని ప్రశంసించారు.  క్రీడలకు అందరినీ కలిపే శక్తి ఉంది. ఈ సినిమా కూడా అలాంటి సందేశాన్నే ఇస్తుంది అని అన్నారు. నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్ అని తెలిపారు. 

Also Read: HBD Kajal Aggarwal: హ్యాపీ బర్త్‌డే కాజల్.. అగ్రతారగా 'చందమామ' సినీ ప్రయాణం ఇదే!

ఇది కూడా చూడండి:Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజం నుంచి ప్రశంసలు రావడంతో 'సితారే జమీన్ పర్' సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 2007లో విడుదలైన 'తారే జమీన్ పర్' సినిమా స్పూర్తితో వచ్చిన ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.  ఆర్‌.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న  పిల్లలకు బాస్కెట్‌బాల్ కోచ్ పాత్రలో నటించారు.  జెనీలియా దేశ్‌ముఖ్  ఫీమేల్ లీడ్ గా నటించింది. 

Also Read:HBD Kajal: ట్విట్టర్ లో ట్రెండవుతున్న కాజల్.. ఈ మ్యాషప్ వీడియోలు చూస్తే ఫిదా!

Advertisment
తాజా కథనాలు