Jailer 2 Updates: 'జైలర్ 2' లోకి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎంట్రీ..!

'జైలర్ 2' షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. రజనీకాంత్ తో పాటు మిర్నా, ఎస్.జే. సూర్య ముఖ్య పాత్రల్లో కనపడనున్నారు. అత్తప్పడిలో 2 వారాల షెడ్యూల్ ప్లాన్ చేసారు మేకర్స్. కాగా ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

New Update
Jailer 2 Updates

Jailer 2 Updates

Jailer 2 Updates: సూపర్ స్టార్ జైలర్ మొదటి భాగం సూపర్ సక్సెస్ తో  'జైలర్ 2' చిత్రాన్ని, దర్శకుడు నెల్సన్ దిలిప్ కుమార్ ఫుల్ జోష్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరగా షూటింగ్ షెడ్యూల్‌లను పూర్తి చేస్తోంది. మొదటి షెడ్యూల్ చెన్నైలో పూర్తయ్యాక, ఇప్పుడు చిత్రబృందం కోయంబత్తూర్ సమీపంలోని అత్తప్పడికి వెళ్లింది, అక్కడ భారీ భాగం షూటింగ్ జరగనుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవల కోయంబత్తూర్‌కు చేరుకున్నారు. ఇక్కడి అందమైన లొకేషన్ల మధ్య షూటింగ్‌ ప్రారంభం అయింది.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

చిత్రంలో మిర్నా కూడా మరోసారి తన పాత్రతో రాబోతుంది. 'జైలర్'లో రజనీకాంత్(Rajinikanth) పాత్ర ముత్తువెల్ పాండియన్‌కి కోడలు పాత్ర  పోషించిన మిర్నా, ఈసారి కూడా కీలక పాత్రలో కనిపించనుంది. మొదటి భాగం లనే  భావోద్వేగ దృశ్యాలు కొనసాగనున్నాయి, పార్ట్ 2 లో ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యత ఉందని సమాచారం.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

సరికొత్త పాత్రలో ఎస్.జే. సూర్య

ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన మేటర్ ఏంటంటే, నటుడు-దర్శకుడు ఎస్.జే. సూర్య(S. J. Suryah) సరికొత్త పాత్రలో జోడయ్యారని తెలుస్తోంది. ఆయన ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ కం డైరెక్టర్ ఎస్ జే సూర్య  రాజనీకాంత్‌తో కలిసి 'జైలర్ 2'లో నటించడం ఇప్పుడు  అభిమానులకు మరింత కిక్ ఇస్తుంది. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

అత్తప్పడిలో 2 వారాల షెడ్యూల్‌ను చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇందులో ప్రధాన కథాంశాలకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తరువాత, షూటింగ్ చెన్నైకు, తదుపరి షెడ్యూల్‌కి తిరిగి వెళ్ళనున్నారు. రజనీకాంత్, మిర్నా, ఎస్.జే. సూర్యతో కూడిన ఈ 'జైలర్ 2' చిత్రం, భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు