/rtv/media/media_files/2025/02/23/AvajrhW0nmIXcwkrWdFX.jpg)
Ritu Varma
Ritu Varma: సందీప్ కిషన్- రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'మజాకా'. త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
Also Read: MAZAKA Trailer: నాన్న ఆంటీ.. కొడుకు అమ్మాయి.. నవ్వులే నవ్వులు 'మజాకా' ట్రైలర్! చూశారా
అవకాశం వస్తే చేస్తా..
అయితే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్ స్క్రీన్ ముద్దు సన్నివేశాలకు తానేమి వ్యతిరేకం కాదని. అవకాశం వస్తే కిస్, హగ్ సన్నివేశాల్లో యాక్ట్ చేస్తానని తెలిపింది. ఇప్పటివరకు ముద్దు సన్నివేశాలకు సంబంధించిన చిత్రాల్లో అవకాశం రాలేదని. కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో యాక్ట్ చేయడానికి ఏమాత్రం ఇబ్బందిపడనని అన్నారు. గత సినిమాల ఆధారంగా ఈ అమ్మాయి అలాంటి పాత్రలు చేయదని కొంతమంది నిర్ణయించుకుంటారు. ఆ కారణంతోనే తన వద్దకు అలాంటి కథలు రావడం లేదు అనుకుంటా అని చెప్పారు రీతూ.
ఇది కూడా చదవండి: Rajinikanth Upcoming Movies: అదిదా రజినీ రేంజ్..! వరుస సినిమాలతో రప్ఫాడిస్తున్న తలైవా..
ఇది ఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన 'మజాకా' ట్రైలర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తండ్రీకొడుకులుగా సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య జరిగే ఫన్నీ సంభాషణలు నవ్వులు పూయించాయి. అన్షు, మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి, హైపర్ ఆది, రఘుబాబు, అజయ్, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా?.. అయితే.. ఈ విషయం మీ కోసమే!
Also Read: Viral News: రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్ అయిన నవవధువు!