Cinema: రేప్ చేస్తామంటూ స్టార్ హీరోయిన్ కి బెదిరింపులు! హీరోతో గొడవ

నటి ఆహానా కుమ్రాకు సోషల్ మీడియాలో అత్యాచార బెదిరింపులు రావడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ అభిమానుల నుంచి తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని  తెలిపారు.  

New Update
Aahana Kumra

Aahana Kumra

నటి ఆహానా కుమ్రా(Aahana Kumra) కు సోషల్ మీడియా(Social Media) లో అత్యాచార బెదిరింపులు రావడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె భోజ్‌పురి నటుడు పవన్ సింగ్(Pawan Singh) అభిమానుల నుంచి తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని  తెలిపారు.  

Also Read :  Kalki 2898 AD: దీపికా అవుట్.. పల్లవి ఇన్.. 'కల్కి' నుంచి బిగ్ అప్డేట్!

ఆన్ లైన్ బెదిరింపులు 

అయితే అహానా   ఇటీవలే 'రైజ్ అండ్ ఫాల్'(Rise And Fall Reality Show)  అనే రియాలిటీ షోలో పాల్గొంది. ఈ షోలో ఆమెకు తన కో కంటెస్టెంట్ అయిన పవన్ సింగ్ తో విభేదాలు వచ్చాయి. ఇద్దరి మధ్య పెద్ద గొడవ కూడా జరిగింది. షోలోనే వీరిద్దరి మధ్య విభేదాలు పరిష్కారం అయినప్పటికీ.. పవన్ సింగ్ అభిమానులు మాత్రం ఆమెపై విపరీతమైన ద్వేషాన్ని చూపిస్తున్నారు. ఇటీవలే ఆమె షో నుంచి ఎలిమినేటై బయటకు రాగా..ఆన్ లైన్లో ఆమెపై  ట్రోల్స్,  నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయాన్ని అహానా ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

అహానా మాట్లాడుతూ.. నేను షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు చంపుతామని.. అత్యాచారం చేస్తామని చాలా బెదిరింపు మెసేజెస్ వచ్చాయి. వాటిని స్క్రీన్ షాట్లను నేను షో నిర్వాహకులకు పంపించాను. నేను ఎవరినీ తిట్టలేదు, ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. మరి నాకు ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి? అని ఆమె ప్రశ్నించారు. అసలు మనం ఏ కాలంలో ఉన్నాము? నేను ఒక మాట అన్నందుకు నాకు ఇన్ని బెదిరింపులు వస్తున్నాయి.. కానీ అవతలి వ్యక్తిని మాత్రం ఎవరూ ఏమీ అనడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అహానా. పవన్ సింగ్ తో జరిగిన గొడవ షోలోనే పరిష్కారం అయ్యింది.  అతడిని తప్పుగా మాట్లాడినందుకు పవన్ తల్లి కాళ్లకు కూడా నేను నమస్కారం చేశారు. పవన్ కూడా తిరిగి తనకు సారీ చెప్పారని గుర్తు చేశారు. 

Also Read: Kalki 2898 AD: దీపికా అవుట్.. పల్లవి ఇన్.. 'కల్కి' నుంచి బిగ్ అప్డేట్!

Advertisment
తాజా కథనాలు