Kalki 2898 AD: దీపికా అవుట్.. పల్లవి ఇన్.. 'కల్కి' నుంచి బిగ్ అప్డేట్!

 బాలీవుడ్ బ్యూటీ  దీపికా పదుకొనె.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నపేరిది. ప్రభాస్- నాగశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ కల్కి పార్ట్ 2 నుంచి ఈ ముద్దుగుమ్మను తప్పించడం  నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

New Update
kalki 2898ad

kalki 2898ad

Kalki 2898 AD:   బాలీవుడ్ బ్యూటీ  దీపికా పదుకొనె.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. ప్రభాస్- నాగశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ కల్కి పార్ట్ 2 నుంచి ఈ ముద్దుగుమ్మను తప్పించడం  నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  పని గంటల విషయంలో దీపికా డిమాండ్స్, యాటిట్యూడ్ కారణంగా మేకర్స్ ఆమెను తప్పించినట్లు టాక్.  దీంతో  సీక్వెల్ లో ఆమె  పాత్ర చేయబోయేది ఎవరనే దానిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. దీపికా స్థానంలో పలు స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. 

సాయి పల్లవి ఇన్ 

ఈ క్రమంలో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం నెట్టింట  వైరల్ గా మారింది.  తాజా అప్డేట్ ప్రకారం..  నటి సాయి పల్లవిని దీపికా స్థానంలో నటించేందుకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం ఆమెకు రికార్డ్ స్థాయి రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట మేకర్స్ . దాదాపు రూ. 8 కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు సినీ వర్గాల్లో టాక్.  ఇప్పటివరకు టాలీవుడ్ లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది.   

అయితే  మొదట దీపికా పాత్ర కోసం  బాలీవుడ్ మరో స్టార్ హీరోయిన్ అలియా భట్ ను సంప్రదించారట మేకర్స్. కానీ అలియా బిజీ షెడ్యూల్స్ కారణంగా  చేయలేకపోయారట. దీంతో మేకర్స్.. మరి సాయిపల్లవి ఈ ఆఫర్ ను అంగీకరిస్తుందా? లేదా అనేదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ పల్లవి  'కల్కి' 2 లో  దీపికా పాత్ర చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అభిమానులకు పండగనే చెప్పాలి. ప్రభాస్- పల్లవి కాంబోను స్క్రీన్ పై చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్. 

Also Read: Shiva Jyothi Baby Shower: ఘనంగా శివజ్యోతి సీమంతం వేడుక.. నటి హిమజ గిఫ్ట్ చూస్తే షాకవుతారు!

Advertisment
తాజా కథనాలు