RGV బిగ్ ట్విస్ట్.. సోషల్ మీడియా పోస్టులపై షాకింగ్ కామెంట్స్

సోషల్ మీడియాలో పోస్టులపై ఆర్జీవీ స్పందించారు. తాను ట్విట్టర్‌లో ఎలాంటి పోస్టులు పెట్టలేదని అన్నారు. ఇది జరిగి ఏడాదికి పైగా కావడంతో అంతా మరిచిపోయానని తెలిపారు. అలాగే నారా లోకేష్‌ని పంపుగాడు అని తానెప్పుడూ అనలేదని అన్నారు.

New Update
RGV (2),

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్న కారణంతో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. దీనిపై ఆర్జీవీ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. తనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 

Also Read: అఖిల్‌ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!

సోషల్ మీడియాలో పోస్టులు నేను పెట్టలేదు

సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు తనకు తెలీదని అన్నారు. దాదాపు ఒక సంవత్సర కాలం గడిచింది. అందువల్ల మరిచిపోయానని అన్నారు. వారిని తిట్టాలనే ఇంటెన్షన్ తనకు లేదని.. తన సినిమా వ్యూహంలోని క్యారెక్టర్స్ కాబట్టి.. ప్రమోషన్ కోసం కొన్ని పోస్టర్స్‌ను షేర్ చేశానని అన్నారు. దానికి ఇంకేం ఇంటెన్షన్ లేదని తెలిపారు. 

Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

అలాగే మరికొన్ని విషయాలు చెప్పారు. అసలు నారా లోకేష్‌ని పంపుగాడు అనే మాట తానెప్పుడూ వాడలేదని అన్నారు. అసలు అలాంటి మాటలు తన నోటి వెంట ఎప్పుడూ రాలేదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తనకు జగన్ అంటే చాలా అభిమానమని అన్నారు. అదే సమయంలో చంద్రబాబుపై అభిమానం లేదా అనే ప్రశ్నకు బదులిచ్చారు. చంద్రబాబుపై ఒకానొక సమయంలో మంచి అభిప్రాయం ఉండేదన్నారు. కానీ ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి చంద్రబాబుపై తన ఒపీనియన్ వేరేగా ఉందన్నారు. 

Also Read: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్‌

ఈ విషయంలో తనను ఎవరు కన్విన్స్ చేసినా తాను ఛేంజ్ అవ్వనని తెలిపారు. ఈ విషయంలో తన ఒపీనియన్‌ని ఎవరూ మార్చలేరని చెప్పుకొచ్చారు. దీని తర్వాత మరో సంచలనం విషయం తెలిపారు. ఇక నుంచి తాను పాలిటిక్స్ జోలికి వెళ్లనని చెప్పుకొచ్చారు. అది మాత్రమే కాదని.. తాను ఓటు కూడా వెయ్యనని పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో అక్కడికెళ్లి సెల్ఫీ దిగడం వెనుకున్న ఉద్దేశాన్ని తెలిపారు.

Also Read: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!

అప్పట్లో వ్యూహం సినిమా తీయడంతో ఇంకాస్త ప్రమోషన్ కోసం అలా చేశానని అన్నారు. అంతేకాని దాని వెనుక ఇంటెన్సన్ ఏమీ లేదని చెప్పారు. ఆయన ఫేమస్ పర్సన్ కాబట్టే వెళ్లి సెల్ఫీ తీసుకున్నానని అన్నారు. ఆ సమయంలో అక్కడ గాంధీ ఉన్నా తీసుకునే వాడినని, హిట్లర్ ఉన్నా తీసుకునే వాడినని, ఆఖరికి జగన్ ఉన్నా తీసుకునే వాడినని తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు