/rtv/media/media_files/2025/03/06/xAEGRhmo9LgW8y2PVWwh.jpg)
rc16 Shiva raj kumar look test
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ #RC1. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో జగపతిబాబు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తదితర స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో తన పాత్ర కోసం లుక్ టెస్ట్ పూర్తి చేసుకున్నారు.
Also Read: RC16: జాను పాప చేతిలో గొర్రెపిల్ల.. రామ్ చరణ్ RC16 నుంచి అదిరే పోస్టర్!
శివరాజ్ కుమార్ లుక్ టెస్ట్..
ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం లుక్ టెస్ట్ కి సంబంధించిన వీడియోను పంచుకుంది. ''#RC16 కోసం కరుణాడ చక్రవర్తి @నిమ్మశివన్న లుక్ టెస్ట్ పూర్తయింది. ఆయన తన పాత్ర కోసం అద్భుతమైన మేకోవర్ కు సిద్ధంగా ఉన్నారు. అది ఎంతో ఉత్కంఠభరితంగా, సంచలనాత్మకంగా ఉండబోతుంది'' అని ట్వీట్ చేశారు. దీంతో శివన్న లుక్ ఎలా ఉండబోతుందా? అని ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. ఇందులో రామ్ చరణ్ కూడా ఓ భిన్నమైన మేకోవర్ లో కనిపించబోతున్నారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ చరణ్ కు మేకోవర్ చేశారు. దీనిని నిర్మాతలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని భారీ లుక్ అని పేర్కొన్నారు.
Look test done ✅
— RC 16 (@RC16TheFilm) March 5, 2025
A terrific look locked 🔒
Karunada Chakravarthy @NimmaShivanna Garu will soon join the sets of #RC16 and begin shooting for his role ❤️🔥#RamCharanRevolts ✊🔥 pic.twitter.com/qyFWqPcdcv
ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం మైసూర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ షెడ్యూల్ ముగిసిన తర్వాత.. ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి యూనిట్ ఢిల్లీకి వెళ్లనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్