RC16: జాను పాప చేతిలో గొర్రెపిల్ల.. రామ్ చరణ్ RC16 నుంచి అదిరే పోస్టర్!

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'RC16'. ఈరోజు జాన్వీ బర్త్ డే సందర్భంగా ఆమెకు విషెష్ తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ''మీ అద్భుతమైన పాత్రను తెరపై చూడడానికి వేచి ఉండలేము'' అంటూ బర్త్ డే విషెష్ తెలియజేశారు.

New Update
RC16 jahnvi look

RC16 jahnvi look

RC16:  రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్  'RC16'. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Also Read:Karimnagar crime: కరీంనగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య.. గదిలో ఉరేసుకొని..

జాన్వీ బర్త్ డే పోస్టర్.. 

అయితే ఈరోజు జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విషెష్ తెలియజేస్తూ 'RC16' టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. జాన్వీ గొర్రెపిల్లను చేతిలో పట్టుకొని పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ''మీ అద్భుతమైన పాత్రను తెరపై చూడడానికి వేచి ఉండలేము'' అంటూ బర్త్ డే విషెష్ తెలియజేశారు. మొత్తానికి జాన్వీ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందనైతే చెప్పారు.. కానీ ఆమె లుక్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. 

Also Read:Oscar Awards 2025: వేశ్యతో ప్రేమలో పడిన కథ.. 'అనోరా' చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు!

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో శివన్న పాత్రకు సంబంధించిన లుక్ సెట్ పూర్తయింది. అలాగే ఆయన త్వరలోనే సెట్స్ పై కూడా జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం మైసూర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ షెడ్యూల్ ముగిసిన  తర్వాత.. ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి యూనిట్ ఢిల్లీకి వెళ్లనుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read:DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్

Advertisment
తాజా కథనాలు