Poison Baby: 'థామా' మాస్ డాన్స్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులు అదరకొట్టిన రష్మికా, మలైకా..

థామా సినిమా నుండి విడుదలైన ‘పాయిజన్ బేబీ’ పాటలో మలైకా అరోరా, రష్మికా మందన్న ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. జాస్మిన్ శాండ్లస్, సచిన్-జిగర్, దివ్య కుమార్ పాడిన ఈ పాటలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక సన్నివేశాలు ఆకర్షణగా నిలిచాయి.

New Update
Poison Baby

Poison Baby

Poison Baby: దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్న 'థామా' సినిమా నుంచి తాజా డ్యాన్స్ సాంగ్ ‘పాయిజన్ బేబీ’ రిలీజ్ అయింది. ఈ పాటలో మలైకా అరోరా(Malaika Arora), రష్మికా మందన్న(Rashmika Mandanna) కలిసి స్క్రీన్‌పై డాన్స్ చేయడం విశేషం. పాటని చూస్తే ఫుల్ మాస్ స్టైల్ అని తెలుస్తోంది.

Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!

పాటను జాస్మిన్ శాండ్లస్, సచిన్-జిగర్, దివ్య కుమార్ కలిసి పాడారు. సంగీతం సచిన్-జిగర్ అందించగా, చిలిపి పదాలతో రాసిన ఈ లిరిక్స్‌కి అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు. క్లబ్‌లో జరిగే డ్యాన్స్ సీన్‌లో మలైకా అరోరా ఆకట్టుకునే స్టెప్పులతో మెప్పించగా, రష్మికా మందన్న కూడ తమ ఎనర్జిటిక్ ప్రెజెన్స్‌తో పాటకు స్పెషల్ ఫీల్ తీసుకొచ్చింది.

Also Read: ప్రతీ సీన్‌ క్లైమాక్స్ లా..! "డూడ్"పై మమితా బైజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Poison Baby: Thamma Special Song

పాట వీడియోలో, ఆయుష్మాన్ ఖురానా పాత్ర క్లబ్‌లోకి అడుగుపెడతాడు. రష్మికతో పాటు ఉండే అతను ఆమెను దగ్గరగా ఉంచాలని చూస్తాడు, కానీ ఆమె చూపు రెడ్‌వైన్ గ్లాస్‌పై పడుతుంది. వెంటనే అది తాగేస్తూ ఆమె మూడ్ మార్చుతుంది. ఈ సీన్ యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది.

Also Read: ఒకేసారి ఇద్దరు హీరోయిన్స్‌తో సిద్ధు.. ‘తెలుసు కదా’ ట్రైలర్ షాక్ ఇచ్చిందా..?

మలైకా, రష్మిక డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మలైకా స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ మువ్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాక, ఈ పాటలో అమర్ కౌశిక్ చేసిన చిన్న కామియో డ్యాన్స్ షాట్‌కి కూడా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

'థామా' చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నారు. దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ప్రధాన పాత్రల్లో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న నటిస్తున్నారు.

Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..

ఈ పాట విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. డ్యాన్స్, మ్యూజిక్, నటీనటుల పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండనుందని టాక్ వినిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు