Mamitha Baiju Dude: ప్రతీ సీన్‌ క్లైమాక్స్ లా..! "డూడ్"పై మమితా బైజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మమితా బైజు మాట్లాడుతూ, "డూడ్" సినిమా దీపావళికి సరైన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రదీప్ రంగనాథన్‌తో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. నా పాత్ర చాలా స్ట్రైట్‌ఫార్వర్డ్‌గా ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్‌లో ప్రతి సీన్‌ను ఎంజాయ్ చేస్తారు’’ అని తెలిపారు.

New Update
Mamitha Baiju Dude

Mamitha Baiju Dude

Mamitha Baiju Dude: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan), మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన "డుడ్" సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన ట్యూన్స్‌ మ్యూజిక్ లవర్స్‌కి బాగా నచ్చాయి.

Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్..!

Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మమితా బైజు మీడియాతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ, ‘‘డూడ్ కథ నాకు చాలా నచ్చింది. దర్శకుడు కీర్తిశ్వరన్‌ కథను వివరించగానే ఓకే చెప్పేశా. ‘ప్రేమలు’ సినిమా తర్వాత 'డుడ్' టీమ్‌ నన్ను సంప్రదించగా, వెంటనే ఒప్పేసుకున్నాను. ఇందులో నేను పోషించిన ‘కురల్’ అనే క్యారెక్టర్‌ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. ఆ పాత్రని చేయడం నాకు కాస్త టఫ్ గా అనిపించింది’’ అని చెప్పారు.

Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!

ప్రదీప్‌ రంగనాథన్ గురించి మాట్లాడుతూ,

‘‘ఆయన చాలా ఎనర్జిటిక్‌ పర్సన్‌. ఎవరితోనైనా బాగా కలిసిపోతారు. ఎలాంటి ఈగో లేదు. అందుకే పని చేయడం చాలా కంఫర్ట్‌గా అనిపించింది. ఆయనకి ప్రేక్షకుల్లో బాగా కనెక్షన్ ఉంటుంది. డుడ్‌లోనూ అతని పెర్ఫార్మెన్స్‌కి అభిమానులు కచ్చితంగా ఫిదా అవుతారు’’ అన్నారు.

Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..

ఈ సినిమాను మమితా బైజు పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ పేర్కొన్నారు. యువతకు బాగా కనెక్ట్ అయ్యే అంశాలతో పాటు కుటుంబంతో కలిసి చూసేలా ఎమోషన్స్, వినోదం ఇందులో చాలా బాగా కుదిరాయని అన్నారు. ‘‘ఈ దీపావళికి ‘డుడ్’ సినిమా థియేటర్లలో చూసే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్‌మెంట్‌ ఉంటుంది. ప్రతి సీన్‌ ఎనర్జీ గా, ఫన్‌గా ఉంటుంది. డుడ్‌ ఓ ఫుల్ ఫన్ రైడ్‌‌ అవుతుంది’’ అని చెప్పింది మమితా బైజు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అక్టోబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Advertisment
తాజా కథనాలు