/rtv/media/media_files/2025/04/18/2xuQ2zVYQgSjIFvn4C5T.jpg)
NTR Dragon Updates
NTR Dragon Updates: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ గురించి రోజుకొక రూమర్ వైరల్ అవుతోంది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా కోసం ఓ స్పెషల్ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: 'ది రాజా సాబ్' ఉన్నట్టా లేనట్టా..? త్వరగా తేల్చండ్రా బాబూ..!
ఈ పాత్ర కోసం ప్రశాంత్ నీల్ బాలీవుడ్ స్టార్‌ను తీసుకోవాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. తాజా బజ్ ప్రకారం ఆ పాత్ర కోసం రణ్ వీర్ సింగ్(Ranveer Singh) ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం, రణ్ వీర్ సింగ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట. మరి ఇది నిజమేనా? అధికారికంగా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.
Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
ఎన్టీఆర్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా
ఇక ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచేలా చేయాలని ప్రశాంత్ నీల్ పక్కా ప్లాన్ తో తెరకెక్కిస్తున్నాడు. అందుకే, కథపై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎక్కువ సమయం కేటాయించి, ఓ మాసివ్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట.
Also Read: మరో బడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.
ఇప్పటివరకూ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఇది హైలైట్ గా ఉండబోతుందట. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ పని చేస్తున్నారు. ఇన్ని భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా తెలుగు సినీ ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పిస్తుందో వేచి చూడాలి!
Also Read: చక్రం క్లైమాక్స్ రిపీట్.. ప్రభాస్ ను చంపబోతున్న మరో డైరెక్టర్..?