Tamannaah Bhatia: మరో బడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.

తమన్నా, అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి యాక్షన్ డ్రామా "రేంజర్"లో నటించనుంది. "హిమ్మతవాలా" తర్వాత వీరి కాంబినేషన్‌లో రెండో సినిమా ఇదే కావడం విశేషం. అజయ్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా కనిపించున్న ఈ సినిమాకి  జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు.

New Update
Tamannaah Bhatia Updates

Tamannaah Bhatia Updates

Tamannaah Bhatia: తమన్నా కొత్త చిత్రం "ఓదెల 2" విడుదలకు సిద్ధమవుతుండగా, తాజాగా ఆమె మరో హిందీ మూవీకి సైన్ చేసింది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్న చిత్రం "రేంజర్"లో ఆమె నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి ఇప్పటికే చిత్రికరించారని సమాచారం. "మిషన్ మంగల్" వంటి గొప్ప  చిత్రానికి దర్శకత్వం వహించిన జగన్ శక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

"రేంజర్" ఒక ఉత్కంఠభరిత యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే  ఈ చిత్రంలో తమన్నా అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి రొమాన్స్ చేయనుంది. హిందీలో "హిమ్మతవాలా" తర్వాత తమన్నా అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి చేస్తున్న రెండవ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.

Also Read: ‘జటాయు’కి ప్రభాస్ సెట్ కాడు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు