రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ మిగతా ప్రాజెక్ట్స్ కంటే 'స్పిరిట్' పైనే ఎక్కువ హైప్ ఉంది. దానికి రీజన్ వీరిద్దరి కాంబినేషన్. ప్రభాస్ కటౌట్ కు సందీప్ రెడ్డి వంగా లాంటి రా అండ్ రస్టిక్ డైరెక్టర్ తో సినిమా పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ. అందుకే ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : అడివి శేష్ సినిమా నుంచి తప్పుకున్న శృతిహాసన్.. కారణం అదే
ప్రభాస్ డ్యూయెల్ రోల్..
ప్రస్తుతం ప్రీపొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్లో సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. కెరీర్లో తొలిసారి ఆయన పోలీస్ పాత్రను చేస్తుండటం విశేషం. ఇదెక్కటే కాదు ఈ సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తారని చెబుతున్నారు.
Also Read : 12 ఏళ్ళ తర్వాత తల్లి కాబోతున్న బాలయ్య హీరోయిన్.. బేబీబంప్ ఫొటోలు వైరల్
దాంతో పాటూ సినిమాలో రణబీర్‌కపూర్, విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. 'స్పిరిట్' స్టోరీలో భాగంగానే రెండు ప్రత్యేక పాత్రలను సందీప్ వంగా డిజైన్ చేశారట. వాటిల్లో తన గత చిత్రాల హీరోలైన రణబీర్‌కపూర్, విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : 'గుంటూరు కారం' టైటిలే తప్పు.. అసలు మేం అనుకున్న సినిమానే వేరు : నాగవంశీ
దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా.. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. 2026 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : దేవిశ్రీ ప్రసాద్ ను వివాదంలోకి లాగిన సీఎం రేవంత్.. షాక్ లో ఫ్యాన్స్!