12 ఏళ్ళ తర్వాత తల్లి కాబోతున్న బాలయ్య హీరోయిన్.. బేబీబంప్ ఫొటోలు వైరల్

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తల్లి కాబోతుంది. BFI 2024 లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన లేటెస్ట్ మూవీ 'సిస్టర్ మిడ్‌నైట్' స్క్రీనింగ్‌ సందర్భంగా.. రాధిక అక్కడ రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె బేబీ బంప్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

New Update
rdka

బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కమర్షియల్ మూవీస్ తో పాటూ బోల్డ్ మూవీస్ లోనూ నటించి అందర్నీ షాక్ కు గురి చేసింది. తెలుగు ఆడియన్స్ కు కూడా ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. తెలుగులో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్తచరిత్ర’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది.

Also Read : 'గుంటూరు కారం' టైటిలే తప్పు.. అసలు మేం అనుకున్న సినిమానే వేరు : నాగవంశీ

నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన 'లెజెండ్' మూవీతో ఆడియన్స్ కు చేరువైంది. ఈ సినిమాలో బాలయ్య మరదలి పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత మరోసారి ఆయనతో 'లయన్' మూవీలో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ త్వరలోనే తల్లి కాబోతుంది. 

Also Read : దేవిశ్రీ ప్రసాద్ ను వివాదంలోకి లాగిన సీఎం రేవంత్.. షాక్ లో ఫ్యాన్స్!

బేబీ బంప్ ఫొటోలు వైరల్..

BFI 2024 లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన లేటెస్ట్ మూవీ 'సిస్టర్ మిడ్‌నైట్' స్క్రీనింగ్‌  సందర్భంగా.. రాధిక అక్కడ రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా రాధికా ఆప్టే తన పెళ్ళైన 12 ఏళ్లకు తల్లి కాబోతుండటం గమనార్హం. 2012 లోనే ఈ హీరోయిన్ ఇంగ్లాండ్కు చెందిన మ్యూజిషియన్ బెనడిక్ట్ టేలర్ను  మ్యారేజ్ చేసుకుంది. 

Also Read : పవర్ స్టార్ టైటిల్ తో యాంకర్ ప్రదీప్ సినిమా.. ఆకట్టుకునేలా మోషన్ పోస్టర్

అయితే తన సినీ కెరీర్ కోసమే ఇన్నాళ్లు పిల్లల్ని వద్దనుకున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాధికా 12 ఏళ్ల తర్వాత తల్లి కాబోతోందనే విషయం తెలియడంతో ఆమె ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలుపుతున్నారు. నవంబర్ లో ఈ హీరోయిన్ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇక రాధికా ఆప్టే 'సిస్టర్ మిడ్‌నైట్' సినిమా విషయానికి వస్తే.. కరణ్ కంధారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 20న విడుదల కానుంది. 

Also Read : 'బాహుబలి 3' పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఏమన్నారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు