Jailer 2 Updates: జైలర్ 2 షూటింగ్ లీక్ చేసిన రమ్య కృష్ణ

రమ్యకృష్ణ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జైలర్ 2 షూటింగ్‌లో తాను ఏప్రిల్ 10 నుంచి పాల్గొంటున్నట్లు వెల్లడించారు. అదే రోజు రమ్య కృష్ణ, రజనీకాంత్ కలిసి చేసిన లెజెండరీ ఫిల్మ్ పడయప్ప 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం కావడం విశేషం.

New Update
Jailer 2 Updates

Jailer 2 Updates

Jailer 2 Updates: సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఎనర్జీని మ్యాచ్ చేయడం ఎవరి తరం కాదు  దానికి తాజా ఉదాహరణ ‘జైలర్ 2’. 10 ఆగస్టు 2023న విడుదలైన జైలర్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న రజనీ, ఆ తర్వాత వేట్టైయాన్ సినిమాను పూర్తి చేసి, వెంటనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ షూటింగ్‌ను కూడా ముగించారు. అంతటితో ఆగలేదు తాజాగా  జైలర్ 2 షూటింగ్‌లో బిజీగా మారిపోయారు.

Also Read: గ్రాఫిక్స్ గాలికి వదిలేశారా..? విశ్వంభరపై 'బన్ని' ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్

నెల్సన్‌ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ సీక్వెల్, ప్రస్తుతం కోయంబత్తూరులో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇటీవలే రజనీకాంత్ కోయంబత్తూరులో జాయిన్‌ అయ్యారు. ఈ సినిమాలో కూడా ఆయన టైగర్ ముత్తు వేల్ పాండియన్ పాత్రలోనే మళ్లీ కనిపించనున్నారు.

jailer2 shooting

పడయప్ప 26 సం'' పూర్తి చేసుకున్న సందర్భంగా

ఈసారి కూడా రజనీకి కూతురుగా మలయాళ నటి మిర్నా మోహన్ రీ ఎంట్రీ ఇస్తుండగా, భార్య పాత్రలో రమ్యకృష్ణ(Ramya Krishna) మరోసారి రజినీకి జోడీగా కనిపించనున్నారు. రమ్యకృష్ణ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జైలర్ 2 షూటింగ్‌లో తాను ఏప్రిల్ 10 నుంచి పాల్గొంటున్నట్లు వెల్లడించారు. అదే రోజు రమ్య కృష్ణ, రజనీకాంత్ కలిసి చేసిన లెజెండరీ ఫిల్మ్ పడయప్ప 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం కావడం విశేషం.

jailer

 

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

ఈ సినిమాలో యోగిబాబు, ఎస్‌జే సూర్య వంటి టాలెంటెడ్ యాక్టర్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మళ్లీ అద్భుతమైన సంగీతాన్ని అందించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను కోయంబత్తూరు, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరంగా 35 రోజుల పాటు ప్లాన్‌ చేసినట్లు సమాచారం.

rajinikanth jailer

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

ఇదిలా ఉండగా, షూటింగ్‌ మొదలుపెట్టకముందే విడుదల చేసిన ప్రోమోకు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. రజనీకాంత్ మేనరిజమ్‌తో మరోసారి తెరపై పండగలా మారబోతోంది. జైలర్ 2 సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కి ఓ గ్రాండ్ ట్రీట్ అవ్వడం ఖాయం.

Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు