Ram Gopal Varma: నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ

ఏపీ పోలీసుల విచారణకు నేడు రామ్ ‌గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. అసభ్యకర పోస్టుల విషయంలో గతేడాది మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది. పోలీసులు నోటీసులు పంపినా పలుమార్లు విచారణకు హాజరు కాలేదు.

New Update
rgv new year tweet

rgv

రామ్ గోపాల్ వర్మపై గతేడాది మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి నేడు రామ్ గోపాల్ వర్మ్ పోలీసు విచారణకు హాజరు కానున్నారు. ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో ఆర్జీవీ విచారణకు వెళ్లనున్నారు. అయితే ఈ కేసులో కోర్టు ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయినా కూడా పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ముందుగానే ఆదేశించింది.

ఇది కూడా చూడండి: Delhi BJP : ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు?... లిస్టులో ఉన్నది వీళ్లే!

ఆర్జీవీ గతంలో ఎన్నో సార్లు కూడా పోలీసు విచారణకు హాజరు కాలేదు. అయితే అసభ్యకర పోస్టులు చేసిన కేసులో ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఆర్జీవీ వాట్సాప్ నంబర్‌కి ఒంగోలు పోలీసులు నోటీసులు పంపారు. అప్పుడు కూడా షూటింగ్ ఉందని ఫిబ్రవరి 4వ తేదీన హాజరు కాలేనని తెలిపారు. ఈ క్రమంలోనే నేడు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన

అసభ్యకర పోస్టులు చేసినందుకు..

ఇదిలా ఉంటే రాం గోపాల్ వర్మ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలను మార్ఫించి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య ఆర్జీవీపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గతేడాది కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు నవంబర్ 19, 25 తేదీల్లో ఆర్జీవీకి నోటీసులు పంపించారు. అయినా కూడా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఒంగోలు పోలీసులు మరోసారి ఆర్జీవీకి నోటీసులు పంపారు.

ఇది కూడా చూడండి: America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!

ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్‌ గ్యాప్‌ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు